SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Beat New Zealand In 2nd T20 After T20 World Cup 2022

న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం ఎవరికి ఉపయోగం? అసలు ఈ గెలుపూ ఓ గెలుపేనా?

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం ఎవరికి ఉపయోగం? అసలు ఈ గెలుపూ ఓ గెలుపేనా?

మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా.. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. తొలి టీ20 వర్షార్పాణం కాగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి.. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతుపట్టని షాట్లతో కివీస్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి.. అదరహో అనిపించాడు. ఇక బౌలింగ్‌లోనూ టీమిండియా చెలరేగిపోయింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను 126 పరుగులకే ఆలౌట్‌ చేసి 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సూర్య మెరవగా.. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా 4 వికెట్లతో రాణించాడు. ఇది కదా టీమిండియా సత్తా అని కొంతమంది అనుకొని ఉండవచ్చు. కానీ.. వరల్డ్‌ కప్‌ తర్వాత.. టీమిండియా సాధించిన ఈ గెలుపు ఓ గెలుపేనా? అనే ప్రశ్న క్రికెట్‌ అభిమానుల నుంచి వ్యక్తం అవుతోంది.

సూర్య కొత్తగా ఏం చేశాడు..?
మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సామర్థ్యంపైన ఎవరీ ఎలాంటి అనుమానాలు లేవు. విరాట్‌ కోహ్లీ లాంటి నేటి తరం గొప్ప ఆటగాడే సూర్య ఆటకు ఫిదా అయిపోయాడు. అలాంటి ప్లేయర్‌ సెంచరీ చేయడం పెద్ద విశేషం కాదు. సూర్యలో ఆ సత్తా ఉందని అందరికీ తెలుసు. పిచ్‌తో, బౌలర్‌తో, పరిస్థితులతో సంబంధంలేకుండా.. అద్భుతమైన షాట్లు ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తాడని గతంలో చూశాం. భవిష్యత్తులోనూ చేస్తాడనే నమ్మకం అందరిలో వందకు వందశాతం ఉంది. సూర్య రాకతో టీమిండియాలో నాలుగో స్థానం పటిష్టంగా మారింది. కానీ.. మిగతా స్థానాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో చెప్పుకుంటూ పోతే.. చారెడు తప్పిదాలు టీమిండియాలో బయటపడ్డాయి. కనీసం వరల్డ్‌ కప్‌ తర్వాత అయినా వాటిపై ఫోకస్‌ పెట్టకుండా.. మళ్లీ చేసిన తప్పులే చేస్తూ.. ఒక్క ఆటగాడు అందించే విజయంతో సంతోష పడాలా? ప్రతిసారీ సూర్య లేదా కోహ్లీ? వీళ్లిద్దరూ విఫలమైతే చేతులెత్తేయడమేనా?

team india

ఓపెనింగ్‌ జోడీ బలహీనంగా ఉంది.. మిడిల్డార్‌, లోయర్డార్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. వరల్డ్‌ కప్‌లో బౌలింగ్‌ వైఫల్యంతోనే టీమిండియా సెమీస్‌తో సరిపెట్టుకుంది. ఇలాంటి లోపాలపై దృష్టిపెట్టకుండా.. టీమిండియా సాధించిన విజయం ఎవరికి ఉపయోగం. ఆడేవాడు ఎలాగో బాగానే ఆడతాడు. అది సూర్య నిరూపించాడు. అందుకే అతని సెంచరీపై కూడా అభిమానులు పెద్దగా రియాక్ట్‌ కాలేదు. ఎందుకంటే సూర్య నుంచి అలాంటి స్కోర్‌ వస్తుందని వారికి తెలుసు. కానీ.. టీ20 వరల్డ్‌ కప్‌ వైఫల్యం తర్వాత.. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు జరగటం లేదనే విషయమే ఇప్పుడు అభిమానుల్లో అసంతృప్తికి కారణంగా నిలుస్తోంది.

సంజూ శాంసన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ ఎక్కడ..?
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమిండియా సెమీస్‌ వరకు చేరిందంటే.. అది విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ వల్లే. అది ఎవరూ కాదనలేని సత్యం. మరి మిగతా వాళ్లు ఏం చేశారో అందరూ చేశారు. ఇలా ఒకరిద్దరిపై ఆధారపడితే టీమిండియాకు వరల్డ్‌ కప్స్‌ రావు. కనీసం వరల్డ్‌ కప్‌ వైఫల్యం తర్వాత అయినా ఈ విషయాన్ని గుర్తించి.. వాటి గురించి తీసుకోవాల్సిన చర్యలపై టీమిండియా ఫోకస్‌ చేయడం లేదు. ఆస్ట్రేలియా లాంటి ఫాస్ట్‌ పిచ్‌లపై ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి 156 వేగంతో బౌలింగ్‌ వేసే బౌలర్‌ను పక్కనపెట్టారు. కనీసం వరల్డ్‌ కప్‌ తర్వాత అయినా.. అతన్ని ఆడించి మరింత ట్రైన్‌ చేసుకోకుండా.. భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి రేపో మాపో రిటైర్‌ అయ్యే ప్లేయర్‌కే అవకాశం ఇస్తున్నారు. అతన్ని ఎలాగో వరల్డ్‌ కప్‌ ఆడించారు కదా? కనీసం వచ్చే వరల్డ్‌ కప్స్‌ కోసమైనా ఉమ్రాన్‌ లాంటి యంగ్‌ లాలెంట్‌ను పదునుపట్టరా?

team india

ఇక మరో బిగ్‌ మిస్టేక్‌.. సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడం. ఓపెనర్‌గా, వన్‌డౌన్‌లో పరుగుల వరద పారించగల ఈ యంగ్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌కు అవకాశం ఇవ్వడమే నేరం అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పటికే వరల్డ్‌ కప్‌లో అట్టర్‌ ఫ్లాప్‌ అయినా పంత్‌కు మాత్రం ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. కానీ.. ఓపెనర్‌గా అద్భుతంగా ఆడే సంజూ శాంసన్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ చేసిన ప్రయోగాలు చాలవన్నట్లు.. ఈ తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అయితే ఏకంగా ఇద్దరు లెఫ్ట్‌ హ్యాండర్లతో ఓపెనింగ్‌ చేయించి బొక్కబోర్లా పడ్డాడు. ఇక బ్యాటింగ్‌లో అత్యంత దారుణంగా విఫలం అవుతున్న దీపక్‌ హుడాను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో ఈ ఒక్క క్రికెట్‌ అభిమానికి కూడా అంతుచిక్కని ప్రశ్న. వరల్డ్‌ కప్‌ నెగ్గలేక చతికిల పడినా.. వచ్చే వరల్డ్‌ కప్స్‌ కోసం ఆలోచించకుండా.. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వకుండా.. ఆడించిన వారినే ఆడిస్తూ.. పోతే టీమిండియా మరో వెస్టిండీస్‌ కావడం ఖాయమని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Congratulations to Team India on a phenomenal victory, and a huge round of applause to @surya_14kumar on his firework century. Go #TeamIndia 🇮🇳#INDvNZ pic.twitter.com/oUGsGMDy3U

— Jay Shah (@JayShah) November 20, 2022

Tags :

  • Crikcet News
  • India vs New Zealand
  • Sanju Samson
  • Suryakumar Yadav
  • Umran Malik
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

  • సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

    సంజూ కోసం రెండు ఫ్రాంచైజీల పోటీ, భారీ ఆఫర్ చేసిన కేకేఆర్

  • Asia Cup 2023: ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

    ఒక్క వన్డే ఆడనివాడికి ఆసియా కప్ లో ఛాన్స్! శాంసన్ మాత్రం రిజర్వ్ ప్లేయర్! ఇదెక్కడి న్యాయం

  • Thilak Varma: సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

    సంజూ, సూర్య దండగా.. తిలక్ వర్మే కరెక్ట్ అంటున్న నెటిజెన్స్!

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

  • బిగ్‌స్టార్ అయినా ఇప్పటికీ ఫ్రెండ్‌షిప్ మర్చిపోడు, అదే అతని స్పెషాలిటీ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam