యువ క్రికెటర్, లవర్ బాయ్ శుబ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తున్న సంగతి విదితమే. కివీస్ తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ(208)తో మెరిసిన గిల్.. రెండో వన్డేలోనూ 40 పరుగులతో రాణించాడు. ఈ నేపథ్యంలో గిల్ పై ప్రశంశలు వెల్లువెత్తున్నాయి. గిల్ ఆటతీరు, అతని టెక్నిక్ సూపర్బ్ అంటూ మాజీలు కితాబిస్తున్నారు. అంతేకాదు.. గిల్ భారీ స్కోర్లు చేయలేడు.. వన్డేలను టెస్టుల్లానే ఆడతాడు.. వంటి ఎన్నో విమర్శలకు సమాధానమూ దొరికినట్లయ్యింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ అతడిని మెచ్చుకుంటూనే ఒక నిక్ నేమ్ సజెస్ట్ చేశాడు.
రాయపూర్ వేదికగా కివీస్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ నవ్వులు పూయించిన సంఘటన మినహా చెప్పుకోదగ్గ విషయాలేమీ లేవు. తొలుత బౌలర్లు చెలరేగితే.. అనంతరం బ్యాటర్లు స్మూత్ గా పనికానిచ్చేశారు. న్యూజిలాండ్ నిర్ధేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని భారత్ 20 ఓవర్లలోనే చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(51)తో మెరిస్తే.. గిల్ 40 పరుగులతో మ్యాచ్ ను శాసించారు. ఈ క్రమంలో లైవ్ మ్యాచ్ కామెంటరీలో పాల్గొన్న గావస్కర్, గిల్ ప్రశంసిస్తూ అతనికి ఒక కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్లు అడిగాడు. ‘గిల్ నీకు ఒక నిక్‌నేమ్ పెడుతున్నా.. అదేంటో తెలుసా.. ‘స్మూత్‌మాన్ గిల్’.. నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా అంటూ కామెంట్ చేశాడు.
‘Smoothman Gill’ – Sunil Gavaskar gives a new nickname to Shubman Gill.#INDvNZ | @ShubmanGill pic.twitter.com/WrRerwIjUz
— CricTracker (@Cricketracker) January 22, 2023
కాగా, గావస్కర్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన గిల్. ”అలా ఏం లేదు సార్.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇక తొలి వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన శుబ్‌మన్ గిల్ పలు రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. వన్డేల్లో భారత్ తరుపున డబుల్ సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే, టీమిండియా తరపున డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఇక 19 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన గిల్ టీమిండియా తరపున వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అయితే, గావస్కర్ సూచించిన నేమ్ అతని ప్రియురాళ్లకు బాగా పనికొస్తాదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల(ప్రియురాళ్లు) వెనుక.. కౌంట్ ఎంతన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి. గిల్ ఆటతీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shubman Gill in ODI since 2022:
64(53), 43(49), 98*(98), 82*(72), 33(34), 130(97), 3(7), 28(26), 49(57), 50(65), 45*(42), 13(22), 70(60), 21(12) & 116(97) & 208(149) pic.twitter.com/VT517kRRxr
— Johns. (@CricCrazyJohns) January 18, 2023
Scenes after Shubman Gill scored back to back Century: pic.twitter.com/tbE2pafTTs
— Kriitii 🌌 (@mistakrii) January 18, 2023
That smile says everything 😂.#SachinTendulkar#SaraTendulkar #sara #ShubmanGill pic.twitter.com/tFi9XyNOiM
— Umar Ahad (@UmarAhad12) January 19, 2023
BREAKING: Sachin Tendulkar announces daughter Sara’s engagement with #ShubmanGill pic.twitter.com/tzvF6sWWD9
— Harsh (@hrsyadv) January 18, 2023