టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్-2022లో భాగంగా ప్రస్తుతం రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా ఐదో టెస్టులో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసిన టీమిండియా.. బౌలింగ్ లోనూ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు 45.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగారు. జానీ బెయిర్ స్టో కెరీర్లో మరో అర్ధ శతకం నమోదు చేశాడు. ఇప్పటివరకు ఒక్క బెయిర్ స్టో మినహా మరే ప్లేయర్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక పోయారు. 45.3 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
కెప్టెన్ బుమ్రా మాత్రం ఈ టెస్టు మ్యాచ్ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటి వరకు బ్యాటింగ్(16 బంతుల్లో 31* పరుగులు), బౌలింగ్(3 వికెట్లు)తో ఇరగదీసిన బుమ్రా ప్రస్తుతం ఓ సూపర్ క్యాచ్ పట్టి మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ బెన్ స్టోక్స్ 18 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈ వికెట్ తప్పకుండా ఎక్స్ పెన్సివ్ గా మారుతుందని అంతా భావించారు.
A spectacular turnaround from Shardul Thakur.
Drops Ben Stokes off Shami’s bowling and then picks up his wicket soon enough, courtesy an excellent catch from Jasprit Bumrah.
Live – https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/kf7N54dUbl
— BCCI (@BCCI) July 3, 2022
ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ మరోసారి షాట్ కు ప్రయత్నం చేయగా అది బుమ్రా చేతుల్లోకి వెళ్లింది. కానీ బుమ్రా దాన్ని నేలపాలు చేశాడు. ఇంకేముంది రెండుసార్లు బెన్ స్టోక్స్ లైఫ్ వచ్చిందని అంతా సంబర పడ్డారు. కానీ, తర్వాత బాల్ కూడా శార్దూల్ అలాగే బౌలింగ్ చేశాడు. బెన్ స్టోక్స్ కూడా సేమ్ షాట్ ఆడాడు. కానీ, ఈసారి కెప్టెన్ బుమ్రా ఏ తప్పు చేయలేదు. బిగ్ డైవ్ చేసి ఆ బాల్ ను పట్టేశాడు. ప్రస్తుతం బుమ్రా పట్టిన సూపర్ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shardul Thakur gets the England captain once again.#ENGvIND pic.twitter.com/x8eUJQ73cB
— CricTracker (@Cricketracker) July 3, 2022
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 10 వికెట్లకు 416 పరుగులు చేసింది. పంత్(146), జడేజా(104) ఆకట్టుకున్నారు. బుమ్రా(16 బంతుల్లో 31*) సూపర్ ఓవర్ తో చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే.. అండర్సన్ 5 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 45.3 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో(91*), బిల్లింగ్స్(7) బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా(3 వికెట్లు), షమీ, సిరాజ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. బుమ్రా సూపర్ క్యాచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A pretty special catch. It’s been an enthralling morning.
Scorecard/Videos: https://t.co/jKoipF4U01
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/wBr6gvOD6x
— England Cricket (@englandcricket) July 3, 2022
