బ్యాటర్‌గా, నాయకత్వ బాధ్యతలతో నిత్యం బిజీ బిజీగా ఉండే రోహిత్ శర్మ ఎట్టకేలకు చిరతునవ్వులు చిందిస్తూ సరదాగా కనిపిస్తున్నాడు. అవునండీ.. మీరు విన్నదే నిజమే. రోహిత్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అందువల్లే ఈ ఆనందం. తానే స్వయంగా దగ్గరుండీ మరీ పెళ్లి పనులు చూసుకుంటున్నాడు.
అసలే ఈ ఏడాది చివరలో వరల్డ్ కప్ పోరు. అందులోనూ స్వదేశంలో టోర్నీ కావడంతో ఆటగాళ్లపై ఎంత ప్రెజర్ ఉంటుందో అందరికీ విదితమే. ఇలాంటి కీలక సమయంలో జట్టు కూర్పుపై కాన్సట్రేట్ చేయాల్సిన టీమిండియా సారథి రోహిత్ శర్మ పెళ్లి పేరంటాలు తిరుగుతున్నాడు. పైగా రేపు జరుగబోయే ఇండియా- ఆస్ట్రేలియా మొదటి వన్డేలో సైతం ఆడటం లేదు. అందుకు కారణం ఏంటో తెలుసా..? హిట్ మ్యాన్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సంగీత్, హాల్దీ ఫంక్షన్లలో జంటగా మెరిసిన హిట్ మ్యాన్ పెళ్లి బాజాలు మోగిన తరువాతనే జట్టుతో కలవనున్నాడు. ఇంతకీ పెళ్లెవరిది అనేగా మీ డౌట్..? అయితే.. చదివేద్దాం.. పదండి.
హిట్ మ్యాన్ సతీమణి రితికా సజ్దే సోదరుడు ‘కునాల్ సజ్దే’ వివాహం మార్చి 16, 17 తేదీల్లో జరగనుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ.. బామ్మర్ది పెళ్లిని దగ్గరుండి జరిపిస్తున్నాడు. ఇప్పటికే కునాల్ సజ్దే వివాహం నేపథ్యంలో నిర్వహించిన సంగీత్, హాల్దీ ఫంక్షన్ల ఫొటోలను రితికా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ వేడుకలకు రోహిత్ శర్మ కూడా హాజరయ్యాడు. ఆసీస్‌తో మ్యాచ్ జరిగే రోజే కునాల్ వివాహం కావున, రోహిత్ ఆసీస్‌తో తొలి వన్డేకు దూరమవుతున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్ ఆడలేనని నెల రోజుల ముందే బీసీసీఐకి సమాచారమిచ్చాడు. ఆ వ్యక్తిగత కారణమేంటన్నది ఇప్పుడు స్పష్టమైంది.
🚨 UPDATE 🚨
Rohit Sharma will remain unavailable for the first ODI against Australia this Friday, due to the marriage of his brother-in-law 📰#INDvAUS pic.twitter.com/z3uwB1ie2X
— SportsBash (@thesportsbash) March 15, 2023
రోహిత్ దూరమవ్వడంతో హార్దిక్ పాండ్యా తొలి వన్డేలో జట్టును నడిపించనున్నాడు. అయితే, ఈ నిర్ణయం పట్ల రోహిత్ పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎవరికైనా బామ్మర్ది పెళ్లి ఎక్కువే. అది అర్థం చేసుకోకుండా.. దేశం కంటే బామ్మర్ది పెళ్లి ఎక్కువైందా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. సొంత బిడ్డ పుట్టినప్పుడు కూడా ధోనీ జట్టుతోనే ఉన్నాడని, దేశం తరఫున ఆడుతున్నప్పుడు ఇలాంటివి తప్పవని అపట్లో మహీ చేసిన వ్యాఖ్యలను ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. హిట్ మ్యాన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma pic.twitter.com/eDMievapPu
— Nikhil Nick 👦 (@Niikhiil_) March 15, 2023