ICC టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే శుక్రవారం పసికూన స్కాట్లాండ్ తో భారత్ తలపడి బంపర్ విక్టరీని నమోదు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ ఆటగాళ్లు భారత బౌలర్ల దాటికి కుప్పకూలిపోయారు. ఇక 17.4 ఓవర్లలో కేవలం 85 పరుగులకే అలౌట్ అయింది. ఇక అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్లు మరోసారి తమ విశ్వరూపాన్ని చూపించారు. KL రాహుల్ 19 బంతుల్లో 50, రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఇండియాని ఒంటి చేత్తో గెలిపించారు. ఇక బౌలర్ల విషయానికొస్తే జడేజా 3. షమీ 3 వికెట్లు పడగొట్టి తమ సత్తా చాటారు.
ఇక ఈ విక్టరితో భారత్ నెట్ రన్ రేట్ కూడా భారీగా పెరిగిపోవటంతో పాటు సెమీస్ ఆశలు కూడా సజీవంగా ఉన్నాయి. ఇక మ్యాచ్ అనంతరం విలేకర్ల సమావేశంలో రవీంద్ర జడేజా పాల్గొన్నాడు. ఇందులో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జడ్డు సింపుల్ వ్యంగంగా జవాబిచ్చాడు. న్యూజిలాండ్ టీం ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడిస్తే, టీమిండియా పరిస్థితి ఏంటీ? అని అడగగా.. ఇంకేముంది అంత సర్దుకుని ఇంటికెళ్ళటమే అంటూ చాలా సింపుల్ సమాధానం ఇచ్చాడు. ఇక న్యూజిలాండ్ టీం ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడే మ్యాచ్ లో న్యూజీలాండ్ ను ఓడిస్తే గనుక భారత్ సెమిస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే గనుక భారత్ ఇంటికెళ్తుంది.
— pant shirt fc (@pant_fc) November 5, 2021
