కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. కేంద్ర నిఘా సంస్థల్లో పనిచేయాలనుకునేవారికి ఇదొక చక్కని అవకాశం.
మొత్తం ఖాళీలు: 1675
తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ లో మొత్తం 48 ఖాళీలుండగా, విజయవాడ పరిధిలో 07 ఖాళీలున్నాయి.
విద్యార్హతలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.
వయోపరిమితి:
10.2.2023 నాటికి సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల లోపు, మల్టీటాస్కింగ్/జనరల్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వడ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు, ఎంటీఎస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ. 56,900 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యరులు రూ.500, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్షలు, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28, జనవరి 2023
దరఖాస్తులకు చివరి తేదీ: 17, ఫిబ్రవరి 2023