గత కొంతకాలంగా పాకిస్థాన్ టీమ్ తో పాటుగా పాక్ క్రికెట్ బోర్డులో సైతం అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే పాక్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంటే.. ఇది చాలదు అన్నట్లుగా.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయ్యారు అయ్యింది పాక్ క్రికెట్ బోర్డు పరిస్థితి. కొన్ని రోజులుగా పాక్ జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో బోర్డులో ఏరివేత మెుదలెట్టారు. మెుదట పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజాను తొలగించింది. అతడి స్థానంలో నజమ్ సేథీని పీసీబీ చీఫ్ గా నియమించింది. ఇక సేథీ బాధ్యతలు చేపట్టాక.. అప్పటి చీఫ్ సెలక్టర్ అయిన మహ్మద్ వసీం ను తొలగించింది. ఆ బాధ్యతలను పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రీదికి తాత్కాలికంగా అప్పగించింది. తాజాగా అఫ్రీదికి షాక్ ఇచ్చింది PCB. చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా ఉన్న షాహిద్ అఫ్రీదిని ఆ పదవి నుంచి తొలగించింది పీసీబీ. ఇందుకు సంబంధించి ఓ కీలక ప్రకటనను జారీ చేసింది పాక్ క్రికెట్ బోర్డు. ఆ స్థానంలో హరూన్ రషీద్(69) ను చీఫ్ సెలక్టర్ గా నియమిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. కమిటీలో మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పీసీబీ పేర్కొంది. ప్రస్తుతం పాక్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం అక్కడి క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ప్రస్తుతం పీసీబీ నడుపుతున్న క్రికెట్ మేనేజ్ మెంట్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు హరూన్ రషీద్. దాంతో అతడికి జట్టుకు సంబంధించిన వివరాలు అన్ని తెలిసి ఉంటాయనే ఉద్దేశంతో రషీద్ ను చీఫ్ సెలెక్టర్ గా నియమించినట్లు తెలుస్తోంది. ఇక పాక్ తరపున 23 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు రషీద్. అదీకాక 2015 నుంచి 2016 వరకు పాక్ చీఫ్ సెలెక్టర్ గా పని చేసిన అనుభవం కూడా అతడికి ఉంది. మరి పాక్ చీఫ్ సెలెక్టర్ గా అఫ్రీదిని తొలగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
He has replaced Shahid Afridi in the chief selector’s role 🏏#CricketTwitter #pakistan pic.twitter.com/wThIWISmfN
— Sportskeeda (@Sportskeeda) January 23, 2023
PCB controversy: Haroon Rashid replaces Shahid Afridi as new chief selector – India TV News pic.twitter.com/eVVJioCwZ2
— TheBuGz (@TheBuGz) January 23, 2023