హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా మహిళల జట్టుకు సారథిగా ఎన్నో చిరస్మరణియమైన విజయాలను అందించింది. తాజాగా జరుగుతున్న టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అరుదైన రికార్డును నెలకొల్పింది టీమిండియా సారథి.
క్రికెట్ లో రికార్డులకు ఆయుష్షు తక్కువ అన్న సామెతను మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ లో రోజుకో రికార్డు బద్దలవుతూనే ఉంది. తాజాగా వరల్డ్ క్రికెట్ లో ఓ అరుదైన రికార్డు నమోదు అయ్యింది. క్రికెట్ చరిత్రలో పురుషులు సాధించలేని ఘనతను టీమిండియా వుమెన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సాధించింది. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డును నెలకొల్పింది టీమిండియా సారథి. మరి హర్మన్ ప్రీత్ నెలకొల్పిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా మహిళల జట్టుకు సారథిగా ఎన్నో చిరస్మరణియమైన విజయాలను అందించింది. తన పదునైన వ్యూహాలతో టీమిండియాను విజయతీరాలకు చేర్చడంలో హర్మన్ ప్రీత్ సిద్దహస్తురాలు. ప్రస్తుతం భారత మహిళల జట్టు ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. తాజాగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధన 87 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగింది. ఇక ఈ మ్యాచ్ ఆడటం ద్వారా ఓ అరుదైన రికార్డును నెలకొల్పింది టీమిండియా సారథి హర్మన్ ప్రీత్ సింగ్.
ఈ రికార్డును ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా సాధించలేకపోయాడు. పురుషుల క్రికెట్ లో సైతం ఇదే రికార్డు కావడం విశేషం. ఇంతకి ఆ రికార్డు ఏంటంటే? అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక అంతర్జాతీయ టీ20లు ఆడిన ప్లేయర్ గా హర్మన్ ప్రీత్ నిలిచింది. ఇప్పటి వరకు హర్మన్ 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడింది. ఈ జాబితాలో 148 మ్యాచ్ లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక 124 మ్యాచ్ లు ఆడి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు షోయబ్ మాలిక్. ఇక 115 మ్యాచ్ లు ఆడి టీమిండియా తరపున ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరి పురుషుల క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రికార్డును నెలకొల్పిన హర్మన్ ప్రీత్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The first 🇮🇳 cricketer to play 150 T20Is 🥇
Harmanpreet Kaur is among the biggest stars in the shortest format 🌟 #T20WorldCup pic.twitter.com/ZZ2fTg0KeH
— ESPNcricinfo (@ESPNcricinfo) February 21, 2023