టీమిండియా- న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. సిరీస్ లో కీలకమైన రెండో వన్డేలో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. టాస్ గెలియి ఫీల్డింగ్ ఎంచుకు టీమిండియా.. మొదటి నుంచీ ఆధిపత్యం కనబరుస్తోంది. షమీ తొలి ఓవర్లోనే ఫిన్ అలెన్ ను బౌల్డ్ చేశాడు. తర్వాత టీమిండియా బౌలర్లు అదే దూకుడుని ప్రదర్శిస్తున్నారు. న్యూజిలాండ్ టాపార్డర్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. కేవలం 15 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. టాపార్డర్ లో ఒక్క ప్లేయర్ కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.
డకౌట్ గా పెవిలియన్ చేరిన ఫిన్ అలెన్ నుంచి.. కాన్వే(7), నికోలస్(2), మిచెల్(1), టామ్ లేథమ్(1) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. గాడి తప్పిన బ్యాటింగ్ ఆర్డర్‌ను నిలబెట్టేందుకు గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్ ప్రయత్నించారు. న్యూజిలాండ్ బ్రేస్ వెల్ నుంచి మొదటి వన్డే తరహా పర్ఫార్మెన్స్ కోరుకుంది. కానీ, 56 పరుగుల వద్ద బ్రేస్ వెల్(22) కూడా క్యాచ్ అవుట్ గా పెలివియన్ చేరాడు. తొలి వన్డేలో బౌలింగ్ లో ప్రభావం చూపలేకపోయిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగుతున్నాడు. హార్దిక్ పాండ్యా కాన్వే క్యాచ్ పట్టుకున్న తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా.. ఈ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో పదో ఓవర్ ని హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్లో నాలుగో డెలివరీ మంచి లెంగ్త్ బాల్ వేశాడు. దానిని డిఫెండ్ చేసే ప్రయత్నం చేసిన కాన్వే బౌలర్ వైపు దానిని ఆడాడు. వెంటనే హార్దిక్ ఆ బంతిని ఒంటి చేత్తో అందుకుని పల్డీ కొట్టాడు. హార్దిక్ పాండ్యా పట్టిన క్యాచ్ చూసి బ్యాటర్ కాన్వే కూడా నమ్మలేక అలాగే ఉండిపోయాడు. ఫ్యాన్స్ కి కూడా అర్తం కాలేదు. తర్వాత టీమిండియా సంబరాలు చూసిన తర్వాత హార్దిక్ క్యాచ్ అందుకున్నాడన్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗔𝗧𝗖𝗛! 😎
Talk about a stunning grab! 🙌 🙌@hardikpandya7 took a BEAUT of a catch on his own bowling 🔽 #TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/saJB6FcurA
— BCCI (@BCCI) January 21, 2023