రెండేళ్ల తరువాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇది భారత జట్టుకు ఒకరకంగా మంచిదే. అయితే.. ఈ ప్రదర్శన ఎన్నాళ్ళు కొసాగుంతుందో చెప్పలేం. ఎందుకిలా అంటున్నాం అంటే.. 2016లో టీ20 క్రికెట్లో అరంగేట్రం చేసిన హార్దిక్.. ఆరంభం నుంచీ అదరగొట్టేవాడు. భారత జట్టుకు కపిల్ దేవ్ లా అసలైన ఆల్‌రౌండర్ దొరికాడని అందరూ అనుకున్నారు. అంతలోనే వెన్నెముక సర్జరీతో హార్దిక్ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత పునరాగమం చేసినా.. బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యేవాడు. పైగా బౌలింగ్ చేయకపోయేవాడు. దీంతో జట్టుకే దూరమయ్యాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఈ ఆల్‌రౌండర్.. “దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్‌లాగా తాను కూడా గొప్ప ఆల్‌రౌండర్ అవ్వాలనుకుంటున్నట్లు” మనసులో మాటను బయటపెట్టాడు…
గాయాలు, ఫిట్ నెస్ కష్టాలు ఒకవైపు, నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయలేని వాడు ఏమి ఆల్‌రౌండర్ అనే విమర్శలు ఒకవైపు. ఇలా నిలకడలేని ఆటతీరుతో రోజూ వార్తల్లో నిలిచేవాడు హార్దిక్ పాండ్యా. జాతీయ జట్టుకు దూరమైనపుడు హార్దిక్ పాండ్యా అనుభవించిన కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఎప్పుడు తినేవాడినో.. ఎప్పుడు పడుకునేవాడినో. నా ధ్యాసంతా.. ఎప్పుడు జట్టులోకి ఎంట్రీ ఇస్తానా? అన్న ఆలోచనే మదిలో మెదిలేదట. ఈ విషయాలు మనవి చెప్పినవి కావు. స్వయంగా పాండ్యానే చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్‌లాగా నేను కూడా గొప్ప ఆల్‌రౌండర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.
Hardik Pandya 🤝 Jacques Kallis 🐐
Well thought 👌👍 @hardikpandya7 pic.twitter.com/9dVxq4lYaB— kalpesh patel marwar (@kalpeshmarwar) August 4, 2022
ప్రపంచ క్రికెట్ లో జాక్వెస్ కలిస్ ఒక దిగ్గజ క్రికెటర్. సచిన్, గంగూలీ, ద్రావిడ్.. ఎంత గొప్ప ఆటగాల్లో కలిస్ కూడా అంతే గొప్ప ఆటగాడు. పైగా 10 ఓవర్ల కోటను కూడా సమర్థవంతగా బౌలింగ్ చేయగలిగేవాడు. అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టులు, వన్డేలు కలిపి 494 మ్యాచులాడిన కలిస్.. 24 వేలకు పైగా పరుగులు 565 వికెట్లు తీశాడు.
వెస్టిండీస్ తో మ్యాచ్ అంతరం మాట్లాడిన హార్దిక్.. భారత జట్టులో తన బౌలింగ్ విలువ ఏంటో తెలుసుకున్నానని తెలిపాడు. తాను పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల జట్టుకు సమతూకం వస్తుందనే విషయాన్ని గ్రహించానని చెప్పుకొచ్చాడు. “ఇంతకుముందు వేరొకరు బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే నేను బౌలింగ్‌కు వచ్చేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి ఓవర్లను వేయగలనని గర్వంగా చెప్పగలను. అలానే బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషిస్తానని నమ్మకంతో ఉన్నానని” చెప్పుకొచ్చాడు. హార్దిక్ కోరిక నిజమవ్వాలని మనమూ కోరుకుందాం. ఈ విషయంపై మీ అభిపాయ్రాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి…
ఇదీ చదవండి: Arshdeep Singh: టీమిండియాలో మరో జహీర్‌ఖాన్‌లా మారిన అర్షదీప్ సింగ్! ఆశలు పెట్టుకోవచ్చా?
ఇదీ చదవండి: IND vs PAK: టీమిండియాతో తలపడేందుకు గట్టి జట్టునే ప్రకటించిన పాకిస్థాన్!