సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంచైజ్‌లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్ 2023 రిటేషన్‌లో భాగంగా సన్‌రైజర్స్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసింది. సన్ రైజర్స్ వదులుకున్న కేన్ మామకు మంచి డిమాండ్ ఉంటుందని అంతా భావించారు. కానీ.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఫ్రాంచైజ్‌లు కేన్ మామను పట్టించుకోలేదు. కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేని కేన్ మామను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాలేదు. కానీ.. బేస్ ధర రూ.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా.. కేన్ మామపై నమ్మకం ఉంచాడు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023లోనూ పటిష్టంగా బరిలోకి దిగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న గుజరాత్ టైటాన్స్‌కు కేన్ విలియమ్సన్ రాకతో వారి మిడిల్డార్ మరింత బలపడనుంది. అయితే.. సన్ రైజర్స్ హైదరాబాద్ కేన్ మామను వదులుకోవడం వల్ల వారికి ఒక కెప్టెన్ కావాల్సి ఉంది. కేన్‌ను కాదనుకున్న సన్ రైజర్స్.. 13.25 కోట్లకు ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్, రూ.8.25 కోట్లకు మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసింది. మరి కేన్ మామను సన్‌రైజర్స్ వదులుకోవడం, గుజరాత్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.