SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Gujarat Scammers Dupe Russians By Creating Fake Ipl

ఫేక్ IPL! లైవ్ కామెంట్రీతో CSK, RCB, MI మ్యాచ్ లు!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Thu - 14 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఫేక్ IPL! లైవ్ కామెంట్రీతో CSK, RCB, MI మ్యాచ్ లు!

అంతర్జాతీయ క్రికెట్ లో ఐపీఎల్‌ కున్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2008లో ఒక సాదా సీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీ.. నేడు ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ లీగ్ గా మారిపోయింది. అలా ఐపీఎల్‌కు ఉన్న ఆదరణనే తమ ఆయుధంగా మలుచుకున్న కొందరు కేటుగాళ్లు.. రష్యన్లను పెద్ద ఎత్తున మోసం చేశారు. ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించి.. బెట్టింగ్‌ల పేరిట ఆశచూపి అందినకాడికి దండుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ భారీ మోసాన్ని గుజరాత్‌ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అసలు మ్యాటర్ ఏంటంటే..

గుజరాత్‌లోని మెహ్సనా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు యూట్యూబ్‌ వేదికగా ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేశారు. అందుకోసం వారు ముందుగానీ పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్లాన్ లో భాగంగా ముందుగా పదుల సంఖ్యలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జెర్సీలు సిద్ధం చేసారు. వాటిని ధరించి.. ప్లేయర్లుగా నటించేందుకు రోజువారి కూలీలను, నిరుద్యోగ యువకులను మాట్లాడుకున్నారు. అంతా ఓకే అయ్యాక మ్యాచులు మొదలెట్టేశారు.

ఈ మ్యాచులు చూస్తున్న వారికి నిజమైన మ్యాచులే.. అన్న అనుభాతి కలిగేలా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే వాయిస్‌ని మిమిక్రీ చేపించడం విశేషం. అలాగే అంపైర్లు కూడా వాకీ టాకీల్లో మాట్లాడుతున్నట్టు నటించేవాళ్లు. అందుకోసం ఫేక్ వాకీ టాకీలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ మ్యాచులకు స్టేడియంలో వేల మంది చూస్తున్నట్టుగా గ్రాఫిక్స్, సౌండ్స్ యాడ్ చేసేవాళ్లు. బెట్టింగ్ చేసేందుకు వీలుగా టెలిగ్రామ్ లింకులను పెట్టేవాళ్లు. ప్రతీ ప్లేయర్‌కు ఏం చేయాలో, ఎలా చేయాలో సూచనలు వెళ్లేవి. ఓ రకంగా పక్కా ప్లాన్‌తో ఎంతో పకడ్భందీగా మూడు వారాల పాటు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచులను నిర్వహించారు.

Believe it or not…! #FakeIPL in Gujarat village dupes Russian #punters

The charade playing out in a remote farm reached the “knockout quarterfinal” stage before the organisers of the “Indian premier cricket league” were caught out by the cops.https://t.co/XwoMXTcfNq pic.twitter.com/jzwNUDW6nO

— The Times Of India (@timesofindia) July 11, 2022

ఈ మ్యాచ్‌లను చూసి నిజమైన ఐపీఎల్ మ్యాచ్‌లని నమ్మిన రష్యన్లు టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ వేసారు. ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లతో రష్యాకు చెందిన టివర్, వొరోనెజ్, మాస్కో నగరాలకు చెందిన చాలా మంది కోట్లలో డబ్బులు పొగొట్టుకున్నారు. దాంతో వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న మెహ్సానా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగలిగారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.

ఈ ఫేక్ ఐపీఎల్ కథనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేల కోట్ల విలువైన ఐపీఎల్‌ని ఫేక్ చేయగలిగిన ఆ కేటుగాళ్ల తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.. నెటిజన్లు. మహేంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర కూడా ఈ వార్తపై స్పందించాడు. ‘ఇది నమ్మశక్యం కాకుండా ఉంది..దీన్ని వాళ్లు ‘మెటావర్స్ ఐపీఎల్’ అని పిలిచి ఉంటే, బిలియన్ డాలర్లు సంపాదించేవాళ్లు..’ అంటూ ఆనంద్ మహేంద్ర కామెంట్ చేశాడు.

Just incredible. And if they had called it the ‘Metaverse IPL’ they could have gotten a billion dollar valuation! https://t.co/62j974dL2U

— anand mahindra (@anandmahindra) July 11, 2022

తన వాయిస్‌ని ఇమిటేట్ చేశారని తెలిసిన క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే, ‘నవ్వకుండా ఉండలేకపోతున్నా.. వాళ్ల కామెంటరీ తప్పకుండా ఓ సారి వినాలి..’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Rohit Sharma- Kapil Dev: కపిల్ దేవ్ కు ఏం తెలుసు- రోహిత్ శర్మ

ఇది కూడా చదవండి: ICC వరల్డ్‌ కప్‌ ప్రోమో విడుదల.. గాడ్జిల్లాలా రిషబ్‌ పంత్ ఎంట్రీ!

Tags :

  • Cricket News
  • gujarat
  • IPL
  • Scam
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam