అంతర్జాతీయ క్రికెట్ లో ఐపీఎల్ కున్న క్రేజ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2008లో ఒక సాదా సీదా దేశీయ లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ టోర్నీ.. నేడు ప్రపంచ క్రికెట్ లోనే అత్యుత్తమ లీగ్ గా మారిపోయింది. అలా ఐపీఎల్‌కు ఉన్న ఆదరణనే తమ ఆయుధంగా మలుచుకున్న కొందరు కేటుగాళ్లు.. రష్యన్లను పెద్ద ఎత్తున మోసం చేశారు. ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించి.. బెట్టింగ్‌ల పేరిట ఆశచూపి అందినకాడికి దండుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ భారీ మోసాన్ని గుజరాత్ పోలీసులు బట్టబయలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు మ్యాటర్ ఏంటంటే..
గుజరాత్‌లోని మెహ్సనా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు యూట్యూబ్ వేదికగా ఫేక్ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేశారు. అందుకోసం వారు ముందుగానీ పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ప్లాన్ లో భాగంగా ముందుగా పదుల సంఖ్యలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జెర్సీలు సిద్ధం చేసారు. వాటిని ధరించి.. ప్లేయర్లుగా నటించేందుకు రోజువారి కూలీలను, నిరుద్యోగ యువకులను మాట్లాడుకున్నారు. అంతా ఓకే అయ్యాక మ్యాచులు మొదలెట్టేశారు.
ఈ మ్యాచులు చూస్తున్న వారికి నిజమైన మ్యాచులే.. అన్న అనుభాతి కలిగేలా ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే వాయిస్‌ని మిమిక్రీ చేపించడం విశేషం. అలాగే అంపైర్లు కూడా వాకీ టాకీల్లో మాట్లాడుతున్నట్టు నటించేవాళ్లు. అందుకోసం ఫేక్ వాకీ టాకీలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ మ్యాచులకు స్టేడియంలో వేల మంది చూస్తున్నట్టుగా గ్రాఫిక్స్, సౌండ్స్ యాడ్ చేసేవాళ్లు. బెట్టింగ్ చేసేందుకు వీలుగా టెలిగ్రామ్ లింకులను పెట్టేవాళ్లు. ప్రతీ ప్లేయర్‌కు ఏం చేయాలో, ఎలా చేయాలో సూచనలు వెళ్లేవి. ఓ రకంగా పక్కా ప్లాన్‌తో ఎంతో పకడ్భందీగా మూడు వారాల పాటు ఈ ఫేక్ ఐపీఎల్ మ్యాచులను నిర్వహించారు.
Believe it or not…! #FakeIPL in Gujarat village dupes Russian #punters
The charade playing out in a remote farm reached the “knockout quarterfinal” stage before the organisers of the “Indian premier cricket league” were caught out by the cops.https://t.co/XwoMXTcfNq pic.twitter.com/jzwNUDW6nO
— The Times Of India (@timesofindia) July 11, 2022
ఈ మ్యాచ్‌లను చూసి నిజమైన ఐపీఎల్ మ్యాచ్‌లని నమ్మిన రష్యన్లు టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ వేసారు. ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లతో రష్యాకు చెందిన టివర్, వొరోనెజ్, మాస్కో నగరాలకు చెందిన చాలా మంది కోట్లలో డబ్బులు పొగొట్టుకున్నారు. దాంతో వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న మెహ్సానా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగలిగారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.
ఈ ఫేక్ ఐపీఎల్ కథనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేల కోట్ల విలువైన ఐపీఎల్‌ని ఫేక్ చేయగలిగిన ఆ కేటుగాళ్ల తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.. నెటిజన్లు. మహేంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర కూడా ఈ వార్తపై స్పందించాడు. ‘ఇది నమ్మశక్యం కాకుండా ఉంది..దీన్ని వాళ్లు ‘మెటావర్స్ ఐపీఎల్’ అని పిలిచి ఉంటే, బిలియన్ డాలర్లు సంపాదించేవాళ్లు..’ అంటూ ఆనంద్ మహేంద్ర కామెంట్ చేశాడు.
Just incredible. And if they had called it the ‘Metaverse IPL’ they could have gotten a billion dollar valuation! https://t.co/62j974dL2U
— anand mahindra (@anandmahindra) July 11, 2022
తన వాయిస్‌ని ఇమిటేట్ చేశారని తెలిసిన క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే, ‘నవ్వకుండా ఉండలేకపోతున్నా.. వాళ్ల కామెంటరీ తప్పకుండా ఓ సారి వినాలి..’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Rohit Sharma- Kapil Dev: కపిల్ దేవ్ కు ఏం తెలుసు- రోహిత్ శర్మ
ఇది కూడా చదవండి: ICC వరల్డ్ కప్ ప్రోమో విడుదల.. గాడ్జిల్లాలా రిషబ్ పంత్ ఎంట్రీ!