క్రికెట్లో కొంతమంది దిగ్గజాలు వ్యక్తిగతంగా వారి జట్లకు ఎన్ని సేవలందించినా.. టైటిల్స్ అందించడంలో విఫలమవుతూ ఉంటారు. వారి పేరిట అత్యుత్తమ రికార్డులు ఉండొచ్చు కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే వారు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు ఏమి ఇవ్వలేకపోయానన్న బాధ అలాగే మిగిలి ఉంటుంది. క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన 'మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్' 2011 వరకూ 5 వరల్డ్ కప్ లు ఆడినా.. ఎన్ని వ్యక్తిగత రికార్డులు సృష్టించినా.. దేశానికి వరల్డ్ కప్ అందించలేకపోయానన్న వెలితితో ఉండేవారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి సైతం గతేడాది వరకు అలాంటి అనుభవాలనే ఎదురుకున్నాడు.
క్రికెట్లో కొంతమంది దిగ్గజాలు వ్యక్తిగతంగా వారి జట్లకు ఎన్ని సేవలందించినా.. టైటిల్స్ అందించడంలో విఫలమవుతూ ఉంటారు. వారి పేరిట అత్యుత్తమ రికార్డులు ఉండొచ్చు కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే వారు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు ఏమి ఇవ్వలేకపోయానన్న బాధ అలాగే మిగిలి ఉంటుంది. దేశం కోసం ఆడుతూ దేశం గర్వించేలా ఏమి చేయలేకపోయామనే అసంతృప్తి వెంటాడుతూ ఉంటుంది. అలాంటి అసంతృప్తితో కేరీర్‌ను అర్ధాంతరంగా ముగించిన ఆటగాడు.. ఏబీ డివిలియర్స్.
క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన ‘మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్’ 2011 వరకూ 5 వరల్డ్ కప్ లు ఆడినా.. ఎన్ని వ్యక్తిగత రికార్డులు సృష్టించినా.. దేశానికి వరల్డ్ కప్ అందించలేకపోయానన్న వెలితితో ఉండేవారు. కానీ, 2011 ప్రపంచకప్ ను భారత జట్టు సొంతం చేసుకున్నాక సచిన్, తన కెరీర్ ని విజయవంతంగా ముగించాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈమధ్య జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ “లియోనల్ మెస్సి” తన జట్టుకి ప్రపంచకప్ ని అందించి తన కెరీర్ ని సార్ధకం చేసుకున్నాడు. ఇలా దిగ్గజాలకి వ్యక్తిగతంగా ఎన్ని రికార్డులు, రివార్డులు ఉన్నా.. దేశానికి అత్యుత్తమ టైటిల్ అందించినప్పుడే వారు సంతృప్తిగా కెరీర్ ముగిస్తారు. కానీ కొంతమంది దిగ్గజాలకు ఇది తీరని కలగా మిగిలిపోయింది. వారిలో ఏబీ డివిల్లియర్స్ ఒకరు.
డివిల్లియర్స్ ఎంత గొప్ప ప్లేయరో అందరికీ తెలుసు. ‘మిస్టర్ 360’గా క్రికెట్ ప్రపంచంలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. ఫార్మాట్ ఏదైనా, పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరైనా ఆధిపత్యం చెలాయించడం ఏబీకే సొంతం. దశాబ్దకాలం పాటు ఐపీఎల్ ప్రాంచైజీ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన ఏబీ, ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడి చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయినప్పటికీ ఆర్సీబీ జట్టుకి ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. ఇది ఎప్పటికీ అతనికి తీరని లోటే. డివిలియర్స్ సైతం ఈ విషయాన్ని పలుమార్లు అంగీకరించాడు. అయినా.. ఇప్పటివరకు ఏబీని ప్రశంసించారే కానీ ఎవరు విమర్శించలేదు. కానీ భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్.. ‘డివిల్లియర్స్ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడు..’ అన్నట్టుగా వ్యాఖ్యానించాడు.
when @ABdeVilliers17 toyed with field placement vs DD 2018.
“One of those nights when you see the ball early ” AB said later
pic.twitter.com/3JwIodATlr— AB shots (@ABshots_) March 5, 2023
“డివిల్లియర్స్ 8 సంవత్సరాల పాటు బెంగళూర్ జట్టుకు ఆడినా ఒక్కసారి టైటిల్ అందించలేకపోయాడు. దురదృష్టవశాత్తు ఏబీకి వ్యక్తిగత రికార్డులే ఉన్నాయి గాని ఒక్క టైటిల్ కూడా లేదు. అదే రైనాను తీసుకోండి.. చెన్నై సూపర్ కింగ్స్ కి 4 టైటిల్స్ అందించాడు.. చిన్నస్వామి స్టేడియంలో ఏబీ 100 సిక్సర్లు కొట్టడం గొప్ప కాదు.. ఎవరైనా కొడతారు..” అంటూ గంభీర్, డివిలియర్స్‌ను తక్కువ చేసేలా మాట్లాడాడు. దీంతో ఆర్సీబీ అభిమానులు గంభీర్ పై ఎదురుదాడికి దిగారు. గంభీర్ ఒక రాజకీయ వేత్త, ప్రత్యర్థులపై ఎప్పుడు చెడుగా మాట్లాడతాడు. చిన్న స్వామి స్టేడియంలో ఓపెనర్ గా వచ్చిన గంభీర్ యావరేజ్ 31. అదే డివిల్లియర్స్ యావరేజ్ 43. ఈ లెక్కలు చాలు గంభీర్ కంటే ఏబీ గొప్ప అని చెప్పడానికి అంటూ అతనిఫై కామెంట్లు ఎక్కుపెట్టారు. గంభీర్ భారతీయుడే అయినప్పటికీ.. అభిమానులు ఏబీకే మద్దతిస్తుండటం గమనార్హం. మరి గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Gautam Gambhir said that Ab de Villiers only had personal records while comparing him with Mr. IPL Suresh Raina. pic.twitter.com/ydD9JPxi5s
— Dr. Cric Point 🏏 (@drcricpoint) March 5, 2023
Gautam Gambhir takes a dig at ABD 😱🤔🏏#gautamgambhir #ABDevilliers #CricketTwitter pic.twitter.com/cLhfYmjcxJ
— InsideSport (@InsideSportIND) March 3, 2023