టీమిండియా మ్యాచ్ ఓడిపోతే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు చాలా ఫీలవుతారు. ఓటమిని తట్టుకోలేక బాధపడిపోతుంటారు. కొంతమంది మ్యాచ్‌లో సరిగ్గా ఆడని ఆటగాళ్లను దూషించడం, వాళ్ల ఇంటిపై దాడులకు దిగడం కూడా చేస్తుంటారు. ఇలాంటి భావోద్వేగాలన్ని సాధారణ క్రికెట్ అభిమానులకు అనుకుంటే పొరపాటే.. టీమిండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ సైతం ఒకసారి టీమిండియా మ్యాచ్ ఓడిపోతే.. గుక్కపట్టి ఏడ్చాడంటా. ఈ విషయాన్ని స్వయంగా గంభీరే తెలిపాడు. టీమిండియా గెలిచిన రెండు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గంభీర్.. ఇలా భావోద్వేగానికి గురయ్యాడా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే అది గంభీర్ అంతర్జాతీయ క్రికట్‌లోక జరిగిన సంఘటన లేండి. వివరాల్లోకి వెళితే..
1992 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ను చూసిన గంభీర్.. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోయాడు. భారత ఓటమి తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చినట్లు గంభీర్ తెలిపాడు. అయితే.. తన జీవితంలో మ్యాచ్ ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం అదొక్కటే అని.. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదని గంభీర్ పేర్కొన్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌ను టీమిండియా గెలిచిన తర్వాత.. టీమిండియా ఆటగాళ్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్‌తో పాటు మరి కొంతమంది ఆటగాళ్లు కూడా ఆ ఉద్విగ్న క్షణాల్లో కంటతడి పెట్టుకున్నారు. కానీ.. గంభీర్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. చాలా గంభీరంగానే ఉన్నాడు తప్ప భావోద్వేగానికి లోను కాలేదు.
ఆ ఫైనల్లో గంభీర్ 97 పరుగులుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్, సచిన్, కోహ్లీ వికెట్లను వెంటవెంటనే కోల్పోయినా.. ధోనితో కలిసి గంభీర్ నెలకొల్పిన పార్టనర్ షిప్ టీమిండియాను ఫైనల్లో గెలిపించింది. ఆ మ్యాచ్‌లో రన్స్ కోసం గంభీర్ డై చేస్తూ.. జెర్సీ ముందు భాగం మొత్తం మట్టి తగిలి ఉన్న దృశ్యాలను ఏ ఇండియన్ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోయి ఉండడు. అలాగే టీ20 వరల్డ్ కప్ 2007 ఫైనల్లోనూ గంభీర్ 75 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇలా వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఒత్తిడిని తట్టుకుని ఆడిన ప్లేయర్.. మ్యాచ్ ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడం అంటే విశేషమనే చెప్పాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
For the GG 😍
This innings made me a fan of him. Sachin Sehwag gone , chasing 275 in WC Final under enormous pressure .. Almost cried when he missed his 100
🇮🇳 #gautamgambhir@GautamGambhir pic.twitter.com/wCpPMcB5XC
— HARDY🎭 (@Cricsomaniac) October 14, 2022