టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. వన్డే టీమ్ కెప్టెన్‌గా విరాట్‌ను బీసీసీఐ తొలగించింది. ఇక మిగిలింది టెస్ట్ కెప్టెన్సీ. ఇక ఇది కూడా విరాట్ కోహ్లీ చేతుల నుంచి దూరం కానున్నట్లు సమాచారం. దీని కోసం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. టీ20 జట్టు కెప్టెన్‌గా కోహ్లీ తనకు తానుగానే తప్పుకున్నాడు. దానిపై చర్చ అనవసరం. కానీ వన్డే కెప్టెన్‌పై విరాట్ కోహ్లీ తొలగింపు ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతుంది.
వన్డే సారథిగా గంగూలీ, ధోని కంటే కూడా మెరుగైన రికార్డు కలిగిన కోహ్లీని ఇలా అవమానకర రీతిలో తొలగించడంపై విరాట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇవేవి పట్టించుకోని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టెస్ట్ కెప్టెన్ మార్పుపై అప్పడే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పరిమిత ఓవర్లకు ఒకే కెప్టెన్ ఉండాలి, 2023 వన్డే ప్రపంచ కప్, ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు లాంటి కారణాలు చూపి కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించినట్లు బయటికి వినిపిస్తున్నా.. వాస్తవానికి గంగూలీ, విరాట్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ అడ్వైజరీ కమిటీగా ఉన్న సమయంలో కుంబ్లేను భారత జాతీయ జట్టుకు కోచ్‌గా నియమించారు.
The All-India Senior Selection Committee also decided to name Mr Rohit Sharma as the Captain of the ODI & T20I teams going forward.#TeamIndia | @ImRo45 pic.twitter.com/hcg92sPtCa
— BCCI (@BCCI) December 8, 2021
కెప్టెన్‌గా ఉన్న విరాట్.. కోచ్ కుంట్లేకు సహకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు రావడం పాకిస్తాన్‌తో ఛాపింయన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోవడంతో కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అనంతరం అంతకుముందు కోచ్‌గా ఉన్న రవిశాస్త్రినే మళ్లీ టీమిండియా కోచ్‌గా నియమించాల్సి వచ్చింది. రవిశాస్త్రికి, విరాట్‌కు మధ్య మంచి ర్యాపో ఉంది. దీని కారణంగానే రవిశాస్త్రి స్థానంలో కోచ్‌గా కుంబ్లేను నియమించడం కోహ్లీకి నచ్చలేదు. కుంబ్లే విషయంలో కోహ్లీ తీరును చాలా సీరియస్‌గా తీసుకున్న గంగూలీ.. సరైన సమయం కోసం ఎదురు చూసి కోహ్లీ వన్డే కెప్టెన్ తొలగించాడనే విమర్శ వినిపిస్తుంది. కాగా ఇప్పుడు టెస్ట్ కెప్టెన్సీ కూడా ముప్పు పొంచిఉంది.
సరైన ప్రత్నాయ్యం కోసం ఎదురు చూస్తున్న గంగూలీకి రోహిత్‌శర్మ రూపంలో మంచి కెప్టెన్ దొరికినట్లు అయింది. అందుకే వన్డే కెప్టెన్‌తో పాటు టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మను ప్రమోట్ చేశారు. ఇకపై కొన్ని మ్యాచ్‌లలో కోహ్లీ వ్యక్తిగత ప్రదర్శన కానీ, జట్టు ప్రదర్శన గానీ గాదితప్పితే.. వెంటనే కోహ్లీని టెస్ట్‌గా కూడా తప్పించి.. రోహిత్‌కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. దీంతో రాబోయే సౌతాఫ్రికా టూర్ కెప్టెన్‌గా కోహ్లీకి చాలా ముఖ్యం. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ విజయవకాశాలతో పాటు, కోహ్లీ వ్యక్తిగత ప్రదర్శనపైనే అతని కెప్టెన్సీ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న విషయం స్పష్టం. కాగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషాపై మండిపడుతున్నారు. గొప్ప ఆటగాడిని ఇలా అవమానిస్తారా? అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. మరి కోహ్లీ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
These two guys have ruined our Indian Cricket. They are holding illegal positions. Virat Kohli has a winning percentage of 70 in ODI cricket. #ViratKohli #ShameOnYouBCCI #ShameOnBCCI #KingKohli #ViratKohli pic.twitter.com/4vFsnb8Uup
— Humza Sheikh (@SheikhHumza12) December 9, 2021