జానీ బెయిర్‌స్టో.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో బాగా వినిపిస్తున్న పేరు. టీ20, వన్డే, టెస్టు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలో తనదైన బ్యాటింగ్ తో ఇరగదీస్తున్నాడు. ఇటీవలే న్యూజిలాండ్ సిరీస్ లో ఓటమి అంచుల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఒటిచేత్తో గెలిపించాడు. ఇప్పుడు టీమిండియాతో రీ షెడ్యూల్డ్ టెస్టులో ఓడిపోయే పరిస్థితి నుంచి ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించే స్థితికి తీసుకెళ్లడంలో బెయిర్ స్టో కీలక పాత్ర పోషించాడు.
రెండు ఇన్నింగ్సుల్లోనూ బ్యాక్ బ్యాక్ సెంచరీలతో బెయిర్ స్టో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఐదో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో జానీ బెయిర్ స్టో రికార్డులతో పాటు వ్యక్తిగత జీవితం గురించి కూడా బాగా సెర్చ్ చేస్తున్నారు. అతని వ్యక్తిగత జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి, అతని ప్రేయసి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జానీ బెయిర్ స్టో ప్రేయసి పేరు ఎలియనార్ టామిల్సన్. ఆమె ప్రముఖ బ్రిటీష్ నటి, సింగర్ కూడా. 2018లో జానీ బెయిర్ స్టోతో ఎలియనార్ టామిల్సన్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారి గురించి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆమె యాంగుస్, జాక్ ది జెయింట్ స్లేయర్ వంటి ప్రముఖ ఆంగ్ల చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె మే 19, 1992లో లండన్ లో జన్మించింది. ఆ తర్వాత ఆమె పేరెంట్స్ యార్క్ షైర్ కు వెళ్లిపోయారు.
ఎలియనార్ టామిల్సన్ జానీ బెయిర్ స్టోతో ప్రేమలో ఉందని వార్తలు రావడమే కాదు.. వాళ్లిద్దరూ రేస్ కోర్సుల్లో కలిసి గడపడం ఎంతో మంది చూశారు. వాళ్లిద్దరూ మంచి జోడీ అని సోషల్ మీడియా మొత్తం కితాబు కూడా ఇచ్చింది. ఈ ఎలియనార్ టామిల్సన్ కు గతంలో తన కో స్టార్ హ్యారీ రిచర్డ్సన్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల తర్వాత వారి రిలేషన్ ఫుల్ స్టాప్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. జానీ బెయిర్ స్టో ప్రేమాయణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
AGAIN!!! 💯😍
Scorecard/Clips: https://t.co/jKoipFmvoB
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/2ep47JN4Og
— England Cricket (@englandcricket) July 5, 2022