వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15 న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రానా నవీద్ ఉల్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కొన్ని నెలలకు ముందు నుంచి విపరీతమైన హైప్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం ఆపేసాయి అప్పటినుంచి ఈ దాయాధి దేశాల మధ్య మరింత దూరం పెరిగింది. ఇక ఐపీఎల్ కి కూడా పాకిస్థాన్ క్రికెటర్లను పక్కన పెట్టడంతో పాక్ క్రికెటర్లు భారత్ ని ఉద్దేశించి ఏవో నెగిటీవ్ కామెంట్లు చేస్తూనే ఉంటారు. మాజీలు కూడా ఈ లిస్టులో ఉన్నారు. మరో రెండు నెలల్లో భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గురించి ఇప్పటి నుంచే డిస్కర్షన్స్ స్టార్ట్ అయిపోయాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ రానా నవీద్ ఉల్ హసన్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఒక్క మ్యాచ్ చూస్తే చాలు అనుకునే అభిమానులకి రానున్న రెండు నెలల్లో చాలా మ్యాచులు జరగడం గమనార్హం. ఆసియా కప్, వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో దాయాధి జట్ల మధ్య కనీసం మూడు నుంచి నాలుగు మ్యాచులు జరిగే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఎంతో ఆతృత్తగా ఈ మ్యాచుల కోసం ఎదురు చూస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 15 న అహ్మదాబాద్ లో జరగబోయే మ్యాచ్ మీదే అందరి దృష్టి ఉంది. అయితే అహ్మదాబాద్ లో ముస్లీమ్ లు పాకిస్థాన్ కి సపోర్ట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ” ఇండియాలో మ్యాచ్ అంటే ఖచ్చితంగా టీమిండియానే ఫేవరేట్. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భారత్ లో ఉన్న ముస్లీమ్ లు మాకే సపోర్ట్ చేస్తారు. ఇంతకు ముందు ఇండియన్ ముస్లీమ్ లు చాలా సార్లు మాకు సపోర్ట్ చేశారు. నేను అక్కడ రెండు సిరీస్ లు ఆడాను. ఇండియన్ ప్రీమియర్ లెగ్ లో కూడా ఆడాను. అహ్మదాబాద్‌లో, హైదరాబాద్‌లో చాలామంది భారత ముస్లింలు, పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఉంటారు. ఇంజమామ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో మాకు చాలా సపోర్ట్ దక్కింది. అంతే కాదు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న చాలా టీమ్స్ కంటే మేం స్ట్రాంగ్ టీమ్‌గా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మాకు సపోర్ట్ ఉంటుంది..’ అంటూ నవీద్ ఉల్ హసన్ చెప్పుకొచ్చాడు. దేశాల మధ్య ఇలా మతాలని తీసుకొని రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.