ఫుట్ బాల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాకర్ సమరం మొదలైపోయింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ ఫిఫా ప్రపంచకప్ ఆదివారం అట్టహాసంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. ఖతార్ రాజధాని దోహాలో నూతనంగా నిర్మించిన అల్ బయత్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చూపరులను కట్టిపడేశాయి. అయితే ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య దేశానికి నిరాశే ఎదురయింది. ఈక్వెడార్ చేతిలో 0-3తో ఖతార్ ఓటమిపాలైంది. ఇలా తొలి మ్యాచ్ ముగిసిందో లేదో.. అప్పుడే FIFA వరల్డ్ కప్ విజేత ఎవరు? అనే అంశంపై నెట్టింట చర్చ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ విజేతకిచ్చే ప్రైజ్ మనీ హాట్ టాపిక్ గా మారింది.
క్రికెట్ మోజులో ఉన్న మనకు ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలపై ఓ లుక్కెద్దాం. ఈ ఏడాది ఖతార్ వేదికగా ‘ఫిఫా’ సమరం జరుగుతోంది. ఈ టోర్నీలో 32 జట్లు పాల్గొంటుండగా, ఒక్కో గ్రూపుకు నాలుగు జట్లు చొప్పున ఎనిమిది గ్రూపులుగా విడగొట్టారు. ఇందులో 16 జట్లు మొదటి రౌండ్ లోనే ఇంటిదారి పట్టనుండగా, మిగిలిన 16 జట్లు ‘రౌండ్ 16’కి అర్హత సాధిస్తాయి. అనంతరం 8 జట్లు క్వార్ట్రర్ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇందులో 4 జట్లు సెమీస్ చేరతాయి. ఆ తరువాత ఎప్పటిలాగానే సెమీస్ లో విజయం సాధించిన రెండు జట్లు ఫైనల్ లో తలపడతాయి.
FIFA World Cup Qatar 2022 Fireworks Opening
— Tansu YEĞEN (@TansuYegen) November 18, 2022
విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆటలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జట్టుకు కాసుల పంట పండనుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. 2022 ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న 32 జట్లకు ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అన్ని జట్లకు ముందస్తుగా సన్నాహాల కోసం రూ. 12 కోట్ల 21 లక్షలు(15 లక్షల డాలర్లు) అందజేశారు. మొత్తం 440 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీతో ఈ ప్రపంచకప్ నిర్వహిస్తున్నారు. 2018 రష్యా అతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ప్రైజమనీ 400 మిలియన్ డాలర్లు.
మొత్తం 440 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీతో ఈ ప్రపంచకప్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన జట్టు ఆటగాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవడం నిజం. 2022 ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న 32 జట్లకు ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ముందస్తుగా అన్ని జట్లకు సన్నాహాల కోసం రూ. 12 కోట్ల 21 లక్షలు(15 లక్షల డాలర్లు) అందజేశారు. కాగా, 2018 రష్యా అతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో ప్రైజమనీ 400 మిలియన్ డాలర్లు.
ఇక 1930-2018 వరకు ఫిఫా వరల్డ్ కప్ 21 సార్లు జరగగా, అత్యధికంగా బ్రెజిల్ ఐదుసార్లు విజేతగా లీచింది. ఇటలీ, జర్మనీ దేశాలు నాలుగు సార్లు గెలుపొందగా.. ఫ్రాన్స్, అర్జెంటీనా, ఉరుగ్వే దేశాలు రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచాయి. ఇంగ్లాండ్, స్పెయిన్ మాత్రం చెరొక్కసారి కప్పును తమ దేశానికి పట్టుకెళ్లాయి.