సాధారణంగా ఓ వ్యక్తి గురించి కానీ.. ఓ ప్రాంతం గురించి గానీ తెలుసుకోవాలంటే వారికి, దానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రాంతానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవాలంటే బుక్స్ చదివితే తెలిసిపోతుంది. కానీ ఓ వ్యక్తికి సంబంధించిన గతం తెలియాలి అంటే అతడు రాసిన ఆత్మకథ చదివితేనే తెలుస్తుంది. ఈక్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు తమ తమ ఆత్మకథల్లో ప్రపంచానికి తెలియని నిజాలు వెల్లడిస్తుంటారు. అందులో తాము జీవితంలో ఎదుర్కొన్న కష్టా, నష్టాలతో పాటుగా ఇతరుల గురించి తెలిసిన నిజా, నిజాలను బయటపెడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ క్రికెటర్ తన ఆత్మకథలో ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్ ను ‘బుల్లి’ అని తిట్టాడు. అది కాక అతడి గురించి మాట్లాడటానికి తన దగ్గర టైమ్ లేదంటూ ఈ బుక్ లో రాసుకొచ్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది 2018 ఆస్ట్రేలియా – సౌతాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో జరిగిన సంఘటన క్రీడా ప్రపంచంలో ఓ సంచలనాన్ని సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు క్రికెటర్లు ఈ సిరీస్ లో బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారు. ఆస్ట్రేలియా బౌలర్ కామెరొన్ బ్రాన్ క్రాఫ్ట్ తోపాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ లు బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారు. ఈ కుంభకోణాన్ని అప్పట్లో ”శాండ్ పేపర్” గా పిలిచారు. ఈ వివాదం గురించి తన ఆత్మకథలో రాసుకొచ్చాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాఫ్ డూ ప్లెసిస్. “ఫాఫ్-థ్రూ-ఫైర్” అనే తన ఆత్మకథలో బాల్ టాంపరింగ్ నాటి వివరాలను పూస గుచ్చినట్లు వివరించాడు.
Don’t forget to join us on Saturday at Constantia Village for a book signing for FAF: Through Fire by Faf du Plessis.@faf1307
RSVP to events@exclusivebooks.co.za pic.twitter.com/Remi3XChuI
— Exclusive Books (@ExclusiveBooks) November 16, 2022
తన ఆత్మకథలో శాండ్ పేపర్ గేట్ వివాదం గురించి ఇలా రాసుకొచ్చాడు.”ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో మిచెల్ స్టార్క్ 9 వికెట్లతో సత్తచాటాడు. అయితే అతడి బౌలింగ్ గురించి, అతడి స్వింగ్ గురించి మాకు తెలుసు. డర్బన్ లో అతడు వేసిన బంతులను మేం ఆడలేకపోయాం. మేం అప్పుడు గమనించింది ఏంటంటే బాల్ పాతబడుతున్న కొద్ది.. అతడు అద్బుతంగా బంతులు వేస్తున్నాడు. మా టీమ్ మ్యాచ్ ను బైనాక్యూలర్ లో చూసినప్పుడు ఓ నిజం వెలుగు చేసింది. అదేంటంటే ఫీల్డింగ్ చేస్తున్న తరుణంలో బాల్ పదే పదే డేవిడ్ వార్నర్ దగ్గరికి వెళ్లడం. ఈ క్రమంలోనే అతడు బాల్ టాంపరింగ్ కు పాల్పడట్లు మాకు తెలిసింది” అంటూ బుక్ లో రాసుకొచ్చాడు డు ప్లెసిస్.
Just checked into the @TheCapital_SA before my book launch tonight @SandtonCity at 18:00. See you guys there #ThroughFire pic.twitter.com/F2lyLGhZqP
— Faf Du Plessis (@faf1307) November 4, 2022
ఈ సిరీస్ లోనే బాల్ టాంపరింగ్ చేయడమే కాకుండా మామ్మల్ని మాటలతో కూడా బెదిరించాలని చూశారని కూడా చెప్పుకొచ్చాడు డు ప్లెసిస్. అయినా గానీ మేం గొప్పగా పుంజుకుని రాణించామని డు ప్లెసిస్ గుర్తు చేసుకున్నాడు. అయితే బాన్ క్రాఫ్ట్ కు, స్టీవ్ స్మిత్ కు నేను సారి చెబుతాను. కానీ డేవిడ్ వార్నర్ కు మాత్రం సారీ చెప్పను అని ఆత్మకథలో రాసుకొచ్చాడు. అదీ కాక వార్నర్ ను ‘బుల్లి’ అన్న పదజాలంతో పిలిచాడు. బుల్లి అంటే తెలుగు లో వేధించేవాడు, రౌడీ అనే అర్దాలు ఉన్నాయి. అంటే వార్నర్ ను డు ప్లెసిస్ రౌడీ అని పిలిచి.. రౌడీలకు సారీ చెప్పేంత, వారితో మాట్లాడేంత టైమ్ నాదగ్గర లేదని ఈ సందర్బంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం డు ప్లెసిస్ ఆత్మకథలోని విషయాలు క్రీడా ప్రపంచంలో చర్చనియాంశంగా మారాయి.
“He was a bully. I don’t have time for bullies.”
We spoke to Faf du Plessis about his new book.
He doesn’t hold back when asked about David Warner.
— Test Match Special (@bbctms) November 15, 2022