పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు 7 మ్యాచుల టీ20 సిరీస్ ను 4-3 తేడాతో కైవసం చేసుకుంది. గడాఫీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో పర్యాటక జట్టు 67 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల చేయగా.. అనంతరం పాక్ 142 పరుగులకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో పాకిస్తాన్ యువ క్రికెటర్ పై ఆ దేశ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పార్చీ.. పార్చీ..’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటనతో పాక్ అభిమానులపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. అభిమానులు ఇలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు చూద్దాం..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. డేవిడ్ మలాన్ 47 బంతుల్లో 8 ఫోర్లు,3 సిక్సర్లతో 78 పరుగులు చేయగా, హారీ బ్రూక్ 29 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 46 పరుగులతో రాణించాడు. అనంతరం 210 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకి పరిమితమైంది. మహ్మద్ రిజ్వాన్ 1, బాబర్ ఆజమ్ 4, ఇఫ్తికర్ అహ్మద్ 19.. ఇలా 33 పరుగులకే పాక్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్ కొచ్చిన కుష్‌దిల్ షా 27(25 బంతుల్లో 112 స్ట్రైక్ రేట్) పరుగులు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అభిమానులు అవుట్ కాగానే.. ‘పార్చీ.. పార్చీ..’ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ పార్చీ అంటే.. అతడు జట్టులో రాణించకున్నా.. మద్దతుతోనే, బంధుప్రీతి వల్లనో కొనసాగవుతున్నాడన్నది వారి అభిప్రాయం. సొంత అభిమానుల చేత ఇలాంటి అవమానం ఎదురవడంతో అతడు తలదించుకుని పెవిలియన్ కు వెళ్లిపోయాడు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
According to reports, Khushdil Shah broke down in the dressing room. Well done Pakistani’s for breaking a grown man, imagine when 30k ppl at the ground and millions watching/cursing you. Years of hard work to wear the badge only to be bullied by your ownpic.twitter.com/t9tnZ499R1
— Raz Khan (@Raz_khan789) October 2, 2022
కాగా, ఖుష్దిల్ షాను ‘పార్చీ’ అంటూ నినాదాలు చేసిన పాకిస్థాన్ అభిమానులపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. ఆటగాళ్లను ఇలా ట్రోల్ చేయడం సరికాదంటూ బుద్ధి చెప్తున్నారు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ కూడా స్పందించాడు. ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం వల్ల ఆటగాడి మానసిక ఆరోగ్యం, కెరీర్‌పై ప్రభావం చూపుతుందని తెలిపాడు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా మ్యాచ్ చూస్తుంటారు. ఇలాంటివి చేయడం సరికాదంటూ సూచించాడు.
And those who were once again ranting ‘parchi parchi’ when Khushdil Shah was playing, please stop and be a bit civil. No player decides to underperform on purpose and he was trying his best out there too, it wasn’t just happening. Players have families watching 🙏🏼 #PAKvENG
— Farid Khan (@_FaridKhan) October 2, 2022
There should be NO SPACE for attacking players PERSONALLY! All of you should have some shame in calling Khushdil out names and taking a dig at Shan Masood on a very personal tweet.
Shame on you all!
— Sawera Pasha (@sawerapasha) October 3, 2022
Fans have the right to like or dislike any cricketer but disrespectful slogans against a player, specially by home crowd, are disappointing.
— Faizan Lakhani (@faizanlakhani) October 2, 2022