ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త శకం మొదలైంది. వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేయడంతో నూతన సారధిగా బెన్ స్టోక్స్ నియమితుడయ్యాడు. ఇక.. హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ పై కూడా వేటు పడడంతో.. ఆ బాధ్యతలను న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కు అప్పగించారు. ఇదే.. సమయంలో కివీస్ జట్టు టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండులో పర్యటిస్తోంది. ఈ పర్యటనే.. మెక్‌కల్లమ్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో.. కోచ్ గా మెక్‌కల్లమ్.. కివీస్ బ్యాటర్ల లీకులు బయటపెట్టాడంటూ విమర్శకులు నోటికి పనిచెప్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్ సుదీర్ఘ షెడ్యూల్ ముగియడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. టెస్టు సిరీస్ కోసం.. న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండులో పర్యటిస్తోంది. లార్డ్స్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజే హై డ్రామా నడిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 40 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆట ప్రారంభమై.. ప్రేక్షకులు ఇంకా సీట్లలో సర్దుకోకముందే న్యూజిలాండ్ కు చెందిన ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ కు చేరారు. ఈ క్రమంలో.. కొత్త కోచ్ గా పగ్గాలు చేపట్టిన మెక్‌కల్లమ్ పై.. తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కోచ్ గా మెక్‌కల్లమ్.. కివీస్ బ్యాటర్ల లీకులు బయటపెట్టాడంటూ విమర్శకులు నోటికి పనిచెప్తున్నారు.
Test cricket 🏏 must be Protected, and let limit T20 🏏 only in T20 WC ( as agree Ravi Shastri too).
See the Beauty of Test ..6 Sleeps .#ENGvsNZ @ICC @BCCI @SGanguly99 @JayShah @Bazmccullum @imVkohli pic.twitter.com/giZmJ105Ag
— praazoo (@praazoo) June 3, 2022
ఇది కూడా చదవండి: Temba Bavuma: ఐపీఎల్ ఆడటమనేది నా కల.. ఏదో ఒకరోజు తప్పకుండా ఆడతా: తెంబా బవుమా
‘వరల్డ్ చాంపియన్ షిప్’ టైటిల్ నెగ్గిన న్యూజిలాండ్ జట్టు.. ఒక్కసారిగా ఇంత దారుణంగా విపలమవడంతో.. న్యూజిలాండ్ అభిమానులు సైతం.. విమర్శకులకు వత్తాసు పలుకుతున్నారు. మెక్‌కల్లమ్.. ఒక చీటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అనంతరం.. ఇంగ్లండ్ సైతం.. 7 వికెట్ల కోల్పోయి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. ఇలా.. ఒకేరోజు.. 17 వికెట్లు నేలకూలడంతో పిచ్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. పిచ్ ఇలాగే ఉంటే మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశముంది. ఆటగాళ్లు విఫలమైతే.. దాన్ని మెక్‌కల్లమ్ కు అంటగట్టడం.. ఎంత వరకు కరెక్టో.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
(“It already is strange!”: NZ coach Gary Stead admits Brendon McCullum giving him an unusual feeling while wearing the England kit ahead of ENG vs NZ 1st Test) has been published on Online Cricket News – https://t.co/pZQ6F4muzr
— www.Cric.News (@CricNewsToday) May 30, 2022
Iron cuts Iron 🔥
Nea Zealand All OUT 132
England coach #brendonmccullum
And then what a come back from Kiwis ENG 116/7 Stumps Day 1, surely NZ ahead if ENG doesn’t take 70 runs lead at-least#ENGvsNZ #ENGvNZ pic.twitter.com/81XpHQl3mL— CRICKETEER UPDATES 🎉🎊🏏 (@786_naqi) June 3, 2022