భారీ అంచనాల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022కు ఎంపికైన వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పైగా టోర్నీ మధ్యలో గాయపడటం కూడా డీకే బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. అయితే.. వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు వెళ్లిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరల్డ్ కప్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడింది. ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లు ఆడనుంది. వీటి కోసం సెలెక్టర్లు వరల్డ్ కప్ సమయంలోనే జట్లను ప్రకటించారు. న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, షమీ, అశ్విన్ లాంటి సీనియర్లతో పాటు డీకే కూడా రెస్ట్ ఇచ్చారు. కానీ.. బంగ్లాతో టెస్టు, వన్డే సిరీస్‌ల కోసం డీకేను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో డీకే ఒక ఎమోషనల్ పోస్టు చేశాడు. ప్రస్తుతం డీకే పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎప్పుడో.. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ ఆడిన డీకే.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా టీ20 వరల్డ్ కప్ ఆడతాడని ఎవరూ ఊహించలేదు. టీమిండియాలో ధోని హవా నడవడంతో.. డీకేకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా కూడా అడపా దడపా జట్టులో కనిపిస్తూ వచ్చాడు. కానీ.. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో కుంగిపోయిన డీకే.. తిరిగి కోలుకుని.. కామెంటేటర్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదులుపెట్టాడు. దీంతో డీకే క్రికెటింగ్ కెరీర్ ముగిసిపోయిందని.. అంతా భావించారు. కానీ.. తన దారి ఇది కాదని తెలుసుకున్న డీకే.. మళ్లీ ఆటపై ఫోకస్ పెట్టాడు. ఐపీఎల్‌లో ఆడుతున్నా.. జాతీయ జట్టులోకి వచ్చేంత ప్రదర్శన చేయలేదు. కానీ.. ఐపీఎల్ 2022కు ముందు ఫినిషర్ రోల్‌పై ఫోకస్‌పెట్టి.. టీమిండియాలోకి వెళ్లేందుకు అదొక్కటే దారి అని ఫిక్స్ అయ్యాడు.
అనుకున్నట్లే.. ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరఫున ఫినిషర్‌గా అదరగొట్టిన దినేష్ కార్తీక్.. చాలా ఏళ్ల తర్వాత.. జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే టీ20 వరల్డ్ కప్ 2022 ఆడాలనే తన గోల్‌ను సైతం నేరవేర్చుకున్నాడు. వరల్డ్ కప్‌లో టీమిండియా జట్టుగా విఫలమైనా.. డీకే వరల్డ్ కప్ జట్టులోకి వచ్చేందుకు చేసిన పోరాటం మాత్రం ఎందరికో స్ఫూర్తిదాయకం. అందుకే డీకే సైతం వరల్డ్ కప్ తర్వాత.. ఫలితంతో నిరాశ చెందినా.. వరల్డ్ కప్ ఆడాలనే తన కల నేరవేరినందుకు ఎమోషనల్ అయ్యాడు. వరల్డ్ కప్‌తో ఎన్నో మధుర క్షణాలు పొందినట్లు, ఆటగాళ్లకు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే.. ఈ పోస్ట్ చూస్తే.. డీకే ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచనలు ఉన్నట్లు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. వయసు పైబడటంతో పాటు.. జట్టులో యువ క్రికెటర్ల మధ్యనే తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో డీకే ఇక క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్-భారత్ సిరీస్‌కు డీకే విశ్లేషకుడిగా ఒక టీవీ షోలో సైతం పాల్గొనడం దీనికి బలం చేకూర్చింది.