మన దేశంలో స్పోర్ట్స్ అనగానే అందరూ క్రికెట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు క్రికెట్ తప్పించి మిగతా గేమ్స్ పై పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. కానీ స్పోర్ట్స్ గురించి కాస్తోకూస్తో తెలిసిన వాళ్లయితే టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటి గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్య ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరగ్గా.. మన దేశానికి చెందిన వాళ్లు చాలామంది మ్యాచులు చూడటానికి వెళ్లారు. మెస్సీ, రొనాల్డో లాంటి స్టార్స్ ని చూసి తెగ సంబరపడిపోయారు. అక్కడికి వెళ్లలేని వారు.. మొబైల్, టీవీల్లో మ్యాచులు చూస్తూ ఆనందపడ్డారు. ఇక టీమిండియా స్టార్ క్రికెటర్లలో కూడా చాలామంది మెస్సీ, రొనాల్డో ఫ్యాన్సే.
ఇక విషయానికొస్తే.. కొన్నిరోజుల ముందు జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా ట్రోఫీ గెలుచుకుంది. ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటౌట్ లో 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దాదాపు మూడున్నర దశాబ్దాల కలని అర్జెంటీనా జట్టు, మరీ ముఖ్యంగా మెస్సీ సాధించి పెట్టాడు. దేశానికి ట్రోఫీ అందించాలనే అతడి చిరకాల కోరిక కూడా నెరవేరింది. టైటిల్ నెగ్గిన ఆనందంలో ఉన్న మెస్సీ.. తన ఫ్యాన్స్, ఫాలోవర్లని అస్సలు మరిచిపోవట్లేదు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వారిలో యాక్టర్స్, క్రికెటర్లు కూడా చాలామందే. అందులో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉన్నాడు. ఇప్పుడు అతడి కూతురు జీవాకు కూడా మెస్సీ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు.
క్రికెటర్ గా ధోనీ అద్భుతమైన ఆటగాడు. ఒకవేళ ఈ గేమ్ లోకి రాకపోయింటే.. ఫుట్ బాలర్ అయ్యేవాడు. ధోనీ లైఫ్ గురించి తెలిస్తే.. ఈ విషయం మీకు కచ్చితంగా ఐడియా వస్తుంది. క్రికెట్ తోపాటు ఫుట్ బాల్ మ్యాచుల్ని చూసే ధోనీ.. మెస్సికీ ఫ్యాన్స్. మహీ కూతురు జీవాకు కూడా మెస్సీ అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో మెస్సీ తాను సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని ఈ చిన్నారికి పంపించి తన ప్రేమను చాటుకున్నాడు. ఈ విషయాన్నే ఇన్ స్టాలో పోస్ట్ చేసిన జీవా.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఇక ఈ జెర్సీపై ‘జీవా కోసం’ అని రాసి ఉంది. కొన్నిరోజుల ముందు బీసీసీఐ సెక్రటరీ జైషాకు కూడా మెస్సీ ఇలాంటి జెర్సీనే బహుమతిగా పంపించాడు. ఇక జీవాకు వచ్చిన గిఫ్ట్ చూసిన పలువురు నెటిజన్స్.. న్యూయర్ కు ఇంతకుమించిన గిఫ్ట్ ఏముంటుంది అనే హ్యాపీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోలు చూస్తే మీకెమనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.