ధావన్, ఆయేషా ముఖర్జీకి 2012 లో వివాహం జరిగింది. వీరికి జొరావర్ అనే 7 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఇక 2020 లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ.. ఎవరి దారి వారు చూసుకున్నారు. బాలుడు మైనర్ కనుక ఆ బాధ్యతను తల్లికి అప్పగించినప్పటికీ.. ఏళ్లకు ఏళ్ళు తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రిని దూరం చేసే హక్కు తల్లికి లేదని ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ ధావన్ కి ఊరటనిస్తూ తీర్పునిచ్చింది.
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ కెరీర్ పరంగానే కాదు ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బందులో ఎదుర్కొంటున్నాడు. ధావన్, ఆయేషా ముఖర్జీకి 2012 లో వివాహం జరిగింది. వీరికి జొరావర్ అనే 7 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆయేషా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి చెందిన మహిళా. ఈమె మొదట ఒకరిని వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. రాయితీ వారిద్దరిని తన పిల్లలుగానే స్వీకరించిన ధావన్.. మెల్ బోర్న్ లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నాడు. అయితే ఏమైందో తెలియదు గాని వీరిద్దరి దాంపత్య జీవితానికి ముగింపు పలికేసారు. 2020 లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే కొడుకు జొరావర్ మైనర్ కావడంతో బిడ్డ బాధ్యతని కోర్ట్ ఆయేషా అప్పగించింది.
ఇక 2020 లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ.. ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆయేషా బిడ్డని తీసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. అయితే కొన్ని నెలల క్రితం ధావన్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ ఉంది బిడ్డను తీసుకురావాల్సిందిగా కోరాడు. దీనికి ఆయేషా ఒప్పుకోవడంతో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్ట్ ని ఆశ్రయించాడు. అయితే అప్పుడు ఆయేషా తరపున జొరావర్ కి ముఖ్యమైన క్లాస్ లు ఉన్నాయి. అందుకే తీసుకొని రావడం కుదరలేదు అని తెలిపింది. దీంతో ధావన్ అభ్యర్ధనను కోర్ట్ తోసిపుచ్చింది. దీంతో ధావన్ కి తన గెట్ టు గెదర్ పార్టీని సమ్మర్ కి వాయిదా వేసుకున్నాడు. అయితే మరోసారి తన బిడ్డను తీసుకురావాలని కోరగా.. ఆయేషా మరోసారి అతని అభ్యర్ధనను తోసిపుచ్చింది. దీంతో మరోసారి ధావన్ ఫ్యామిలీ కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్ట్ ధావన్ కి ఊరటనిస్తూ తీర్పునిచ్చింది.
బాలుడు మైనర్ కనుక ఆ బాధ్యతను తల్లికి అప్పగించినప్పటికీ.. ఏళ్లకు ఏళ్ళు తండ్రికి బిడ్డను, బిడ్డకు తండ్రిని దూరం చేసే హక్కు తల్లికి లేదు. తండ్రి ప్రవర్తన తప్పుగా ఉంటే తప్ప.. బిడ్డను దూరం చేసే హక్కు తల్లికి లేదని తెలిపింది. దీంతో ఆయేషాని తప్పు ప్పట్టిన కోర్ట్.. ధావన్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ ఫంక్షన్ కి తీసుకురావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ధావన్ టీంఇండియాలో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఐపీఎల్ ఆడిన ధావన్ కెప్టెన్ తో పాటు ఆటగాడిగా విఫలమయ్యాడు.