ధనాధన్ క్రికెట్ హంగామా ఐపీఎల్ ఈ నెల 26న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి మరికొద్ది రోజులే ఉండడంతో అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. కానీ అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఐపీఎల్ ప్రారంభానికి ముందు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ అన్రిచ్ నూర్జే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
నూర్జే గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతను సీజన్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. కాగా నూర్జేను ఢిల్లీ రూ.6.5 కోట్లకు రిటేన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి నూర్జే లేకపోవడంతో ఢిల్లీ బౌలింగ్ అటాక్ కొంత బలహీనపడే అవకాశం ఉంది. కాగా నూర్జే తాజా పరిస్థితిపై, అలాగే బంగ్లాదేశ్‌తో సిరీస్ విషయంలో సౌతాఫ్రికా బోర్డు నుంచి క్లారిటీ తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ బీసీసీఐని కోరినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL కి ముందు SRHకి షాక్! కావ్య పాప నిర్ణయం కొంపముంచిందా?
#DelhiCapitals could miss the services of their pace spearhead #AnrichNortje as he is yet to recover from his injury. #IPL2022 https://t.co/4UwEA34KwL
— Circle of Cricket (@circleofcricket) March 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.