ఐపీఎల్ లో స్పెషల్ జెర్సీలు వేసుకునే జట్లు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యే లక్నో సూపర్ జయింట్స్ ISL ఇండియన్ ఫుట్ బాల్ ఛాంపియన్లకి స్పెషల్ గా నివాళి ఇస్తూ..స్పెషల్ జెర్సీ ధరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ జెర్సీతో ఆ లిస్టులోకి చేరనుంది.
ఐపీఎల్ లో స్పెషల్ జెర్సీలు వేసుకునే జట్లు ఎక్కువవుతున్నాయి. మొన్నటి సీజన్ వరకు ఆర్సీబీ మాత్రమే పర్యావరణం మీద అవగాహన కలిగిస్తూ గ్రీన్ కలర్ జెర్సీ వేసుకోవడం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ ఒక్క సీజన్ లో మాత్రం ఒకదాని తర్వాత మరొకటి ఏ స్పెషల్ జెర్సీలో కనబడి అభిమానులకి సర్ ప్రైజ్ ఇచ్చేనందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్.. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచులో క్యాన్సర్ వ్యతిరేఖంగా పోరాటం చేస్తూ.. లావెండర్ కలర్ జెర్సీలో కనిపించి సందడి చేసింది. ఇక ఈ మధ్యే లక్నో సూపర్ జయింట్స్ ISL ఇండియన్ ఫుట్ బాల్ ఛాంపియన్లకి స్పెషల్ గా నివాళి ఇస్తూ.. వారు ఫుట్ బాల్ డ్రెస్ లో ధరించిన డ్రెస్ ధరించనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ స్పెషల్ జెర్సీతో ఆ లిస్టులోకి చేరనుంది.
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తానం ముగిసింది. ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 5 విజయాలు సాధించిన ఢిల్లీ.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపధ్యంలో ఢిల్లీ తాము ఆడబోయే చివరి మ్యాచులో ఒక స్పెషల్ జెర్సీలో కనబడుతుంది. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ మ్యాచ్ ఆడనుంది. అయితే ఢిల్లీ తమ చివరి లీగ్ మ్యాచ్ ని మే 20న సొంత వేదిక (అరుణ్ జైట్లీ స్టేడియం) ఆడడం కలిసొచ్చే అంశం. ఈ మ్యాచ్ లో ఢిల్లీ తమ రెగ్యులర్ జెర్సీలో కాకుండా రెయిన్ బో జెర్సీలలో దర్శనమివ్వనుంది.
ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీ ఆటగాళళ్లు వేసుకునే రెగ్యులర్ జెర్సీ కలర్ మీదే ఏడు రంగుల చారలు ఉండే విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన జెర్సీని వేసుకోనున్నారు. అయితే ఈ జెర్సీని వేసుకోవడానికి గల ప్రత్యేకమైన కారణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. ‘రెయిన్ బో కలర్ స్వలింగ సంపర్కులకు చిహ్నంగా ఉంది. వారికి మద్దతుగానే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ జెర్సీని వేసుకోనుంది’ అన్న చర్చ సాగుతోంది. దీనిపై ఢిల్లీ అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఢిల్లీ జట్టు ఇలా స్పెషల్ జెర్సీలో కనబడడానికి ఏమైనా కారణం ఉందా?లేదా చివరి మ్యాచ్ లో స్పెషల్ గా కనిపించాలని అనుకుంటున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.