దొంగ తెలిలితేటలు ఎన్ని ఉన్నా.. కథ అడ్డం తిరిగితే.. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. డమ్మీ గన్‌ను చూపించి.. దొరికిందంతా దోచుకుందామని ప్రయత్నించి దొంగకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏ రెస్టారెంట్‌లో అయితే దొంగతనానికి యత్నించాడో.. అదే రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్ రియల్ గన్‌కు బలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో నకిలీ తుపాకీతో దోపిడీకి యత్నించాడో దొంగ. రెస్టారెంట్‌లోకి వెళ్లి డమ్మీ గన్‌తో కస్టమర్లను బెదిరించి.. వారి నుంచి డబ్బులు దండుకున్నాడు. అతని దెబ్బకు రెస్టారెంట్‌లోని కస్టమర్లంతా భయంతో వణికిపోతే.. ఒకతను మాత్రం.. తన దగ్గర ఉన్న రియల్ గన్ తీసి ఆ దొంగను కాల్చేశాడు.
అంతే.. ఒక షాట్‌తో పాపం ఆ డమ్మీ గన్‌తో వచ్చిన దొంగ ప్రాణాలు వదిలాడు. కిందపడిపోయిన తర్వాత కూడా దొంగ దగ్గరికి వెళ్లి మరీ.. ఆ కస్టమర్ మరికొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే.. ఆత్మరక్షణ కోసం ఆ కస్టమర్ దొంగపై కాల్పలు జరిపినట్లు తెలుస్తున్నా.. పోలీసులు అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వారానికి ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రెస్టారెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దొంగ డమ్మీ గన్‌తో కస్టమర్లను బెదిరించడంతో.. అందులో ఒక కస్టమర్ తన వద్ద ఉన్న గన్‌తో దొంగను షూట్ చేయడం అంతా రికార్డ్ అయింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨#WATCH: Self-defense shooting of armed robber at a restaurant
Watch as a brave customer at a taqueria shot restaurant shot and killed an armed criminal who was robbing from other customers. Houston police are now looking for that person for questioning pic.twitter.com/g7EYjms5PZ
— R A W S A L E R T S (@rawsalerts) January 7, 2023