ఆసియా కప్ 2022ను టీమిండియా భారీ విజయంతో ముగించింది. సూపర్ ఫోర్‌లో గురువారం అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో, భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లతో చెలరేగారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో భారత్ ఏకంగా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ.. కీలకమైన మ్యాచ్‌లో ఫేలవ ఆటతీరుతో ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన టీమిండియా.. ఉపయోగం లేని మ్యాచ్‌లో ఊపేస్తే ఏంటి ప్రయోజనం అంటూ క్రికెట్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్‌పై మండిపడుతున్నారు. మొత్తం సర్వనాశం చేసి ఇప్పుడు ఇలాంటి బౌలింగ్ చేస్తే.. ఎవరికి ఉపయోగం అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆసియా కప్ గ్రూప్ స్టేజ్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌ను ఓడించిన టీమిండియా మంచి ఆరంభాన్ని అందుకుంది. టైటిల్ హాట్‌ఫేవరేట్‌గా ఉన్న భారత్.. సూపర్ ఫోర్‌లో మాత్రం దారుణంగా విఫలం అయింది. టాస్ కీలకంగా మారిన మ్యాచ్‌ల్లో దురదృష్టవశాత్తు కెప్టెన్ రోహిత్ శర్మ పాక్, శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలవలేదు. అయినా.. తొలుత బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ ఇచ్చినా.. ఫేలవ బౌలింగ్‌తో రెండు మ్యాచ్‌లను టీమిండియా ఓడింది. రెండు మ్యాచ్‌లను చివరి ఓవర్ వరకు లాక్కెళ్లిన భారత్.. 19వ ఓవర్‌లోనే దారుణంగా దెబ్బతింది. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ 19వ ఓవర్ వేసింది భువీనే. 19వ ఓవర్‌లో పాక్‌తో 19, శ్రీలంకతో 14 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో రెండు మ్యాచ్‌ల్లోనూ చివరి ఓవర్ వేసిన అర్షదీప్‌కు కేవలం 7 పరుగులే డిఫెండ్ చేసేందుకు మిగిలాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లోనైనా 19వ ఓవర్‌ను కొంచెం బెటర్‌గా వేసుంటే.. టీమిండియా ఆసియా కప్ ఫైనల్ ఆడేది. కానీ.. భువీ చేసిన పొరపాటుతో టీమిండియా ఆసియా కప్ 2022ను తప్పకుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అందుకే అఫ్ఘనిస్థాన్‌పై 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు ఇచ్చి 5 వికెట్ల హాల్ సాధించి కెరీర్ బెస్ట్ ప్రదర్శన ఇచ్చినా భువీని ఫ్యాన్స్ క్షమించడం లేదు. అసలు ఆసియా కప్ 2022 పోవడానికి భువీనే కారణం అంటూ తిట్టిపోస్తున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు ఈ రికార్డ్ బ్రేకింగ్ బౌలింగ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. ఈ ప్రదర్శనతో భువీ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా నిలిచాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో ఆఫ్ఘాన్ బ్యాటింగ్ లైనప్‌ను గడగడలాడించాడు. విరాట్ కోహ్లీ సైతం భువీ స్వింగ్‌ను పాములాగా బాల్‌ను స్వింగ్ చేస్తున్నావంటూ ప్రశంసించాడు. కాగా.. తీవ్ర ఒత్తిడిలో బౌలర్లు పరుగులు ఇవ్వడం సహజం ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో ఇచ్చిన ప్రదర్శన ఆధారంగా ఆటగాడిని తీవ్ర దూషించడం సరికాదు. మరి ఆఫ్ఘాన్‌పై భువీ ప్రదర్శన, క్రికెట్ ఫ్యాన్స్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఒక్క షేక్‌హ్యాండ్‌తో మారిన శాపం! ఫామ్‌లోకి కోహ్లీ! కష్టాల్లోకి బాబర్!
king of swing#bhuvneshwarkumar #Bhuvi #IndianCricketTeam pic.twitter.com/4QgjaKHtnY
— Rohit Solanki 🇮🇳 (@Im_the_one_45) September 8, 2022
VK and BK combine to give India a thumping win 👏🔥#ViratKohli #BhuvneshwarKumar #India #INDvsAFG #AsiaCup pic.twitter.com/fhiCt8mD3T
— Wisden India (@WisdenIndia) September 8, 2022
POV: When your favourite cricketers back to their best 🔥🥹🥹🔥❤️#ViratKohli𓃵 #bhuvneshwarkumar pic.twitter.com/euDd1nTgnv
— LOKESH CHOWDARY (@_LokeshChowdary) September 8, 2022
Man of the series of Asia Cup #INDvSL #bhuvneshwarkumar pic.twitter.com/5hweDXsLoj
— Sanjay Bisht (@sanjayybishtinc) September 6, 2022