గ్రౌండ్‌లో క్రికెటర్లు కొట్టిన భారీ షాట్లు వెళ్లి ప్రేక్షకుల మధ్య పడటం కామన్. కొన్ని సార్లు వాటిని ప్రేక్షకులు క్యాచ్‌లు పట్టుకోవడం స్పెషల్. కానీ.. న్యూజిలాండ్-శ్రీలంక టెస్ట్ సందర్భంగా జరిగిన ఈ సంఘటన మాత్రం వెరీవెరీ స్పెషల్.
క్రికెట్‌లో కొన్ని సార్లు బ్యాటర్లు కొట్టిన భారీ సిక్సులు వెళ్లి స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకుల మధ్య పడతాయి. కొన్ని సిక్సులు స్టేడియం బయటపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఆటగాళ్లు కొట్టిన సిక్సులు ప్రేక్షకులను గాయాలపాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి బాధకరమైన ఘటన మరొకటి జరగకుండా.. ఓ క్రికెట్ ఫ్యాన్ సూపర్ మ్యాన్‌లా మారిపోయాడు. బ్యాటర్ కొట్టిన భారీ సిక్స్ వెళ్లి ప్రేక్షకుల మధ్య పడుతుంటే.. మెరుపులా దూసుకొచ్చి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు. అతను ఆ క్యాచ్ పట్టుకపోయి ఉంటే.. కచ్చితంగా ఆ బాల్ వెళ్లి మ్యాచ్ చూస్తున్న ఓ అమ్మాయి తలపై బలంగా తాకేది.
క్రికెటర్ కొట్టిన సిక్స్‌ను క్యాచ్ పట్టుకుని సంబురపడిపోయే ఫ్యాన్స్ చాలా మందిని చూశాం.. ఈ వ్యక్తి మాత్రం అలాంటి సంతోషాన్ని రెండింతలు పొందడమే కాకుండా.. ఓ అమ్మాయిని గాయపడకుండా రక్షించాడు. దీంతో ఆ వ్యక్తిని అక్కడున్న మిగతా ప్రేక్షకులతో క్రికెటర్లు సైతం చప్పట్లో అభినందించారు. ప్రస్తుతం ఈ అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు కొట్టిన భారీ సిక్స్‌ను బౌండరీ లైన్ అవతల కూర్చోని మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని అద్భుతంగా ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు. దాంతో ఓ అమ్మాయి గాయపడకుండా బతికిపోయింది. మరి కింద ఉన్న వీడియో చూసి సింగిల్ హ్యాండ్ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A new entry into the Crowd Catch Hall of Fame 🏏 #NZvSL pic.twitter.com/TbaUTGfCnF
— BLACKCAPS (@BLACKCAPS) March 11, 2023