సాకర్ దిగ్గజం పీలే ఆరోగ్యం మరింత విషమించింది. గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడిగా పేరు గాంచిన పీలే(బ్రెజిల్) ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. సావో పాలోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి, వైద్యం అందిస్తున్నారు. రాను.. రాను.. అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని.. మూత్ర పిండాలు, గుండెపై ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఈ 82 ఏళ్ల సాకర్ దిగ్గజం చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆదివారం ఆస్పత్రి వచ్చారు. ఈ క్రమంలో హాస్పిటల్‌లోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫోటోలను చూసి అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు.
పీలే కుమార్తె కెల్లి నాసిమెంటో తండ్రిని హత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “క్రిస్మస్ సందర్బంగా తమ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ పోరాటంలో నాన్నతోనే ఉంటాం” అని పోస్ట్ చేసింది. ఇదే సమయంలో పీలే కుమారుడు ఎడిన్హో.. “పాపా… నువ్వే నా బలం..” అంటూ తండ్రితో ఉన్న చిన్న నాటి ఫోటోను షేర్ చేశాడు.
Pelé’s daughter: “Here we go, in the fight and in faith. One more night together.” ❤️🙏 pic.twitter.com/dn3iophYCW
— EuroFoot (@eurofootcom) December 24, 2022
రొటీన్ చెకప్ లో భాగంగా ఆస్పత్రిలో చేరిన తరువాతే పీలే ఆరోగ్యం మరింత క్షీణించింది.ఆయన శరీరం కీమో థెరపీ చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పేగు కణితిని గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించారు. ఆ తర్వాత అతడికి కీమో థెరపీ జరిగింది. ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం సందర్భంగా పీలే తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పీలే క్యాన్సర్ మరింత ముదిరిందని ఇటీవల వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దిగ్గజ సాకర్ వీరుడైన పీలే త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..
Pele says goodbye to family and friends from the hospital bed. Football legend, Pele is slowly losing the battle against Cancer, family says ‘his condition is worsening even further’. 😢🙏💔 pic.twitter.com/IvIQJ8zuXd
— Frank Khalid (@FrankKhalidUK) December 26, 2022