పాకిస్తాన్ పవర్ హిట్టర్ ఇఫ్తిఖర్ అహ్మద్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఫార్చ్యూన్ బరిశల్ కు సారథ్యం వహిస్తున్న అతను టోర్నీ అంతటా తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. కానీ, నేడు రంగాపూర్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించాడు. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ బంగ్లా యువ బౌలర్లను ఊచకోత కోసాడు. 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేరుకున్నాడు. అతని దాటికి బరిశల్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది.
షకిబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ఇఫ్తిఖర్ అహ్మద్.. వంటి స్టార్ బ్యాటర్లతో నిండిన బరిశల్ ముందు రైడర్స్ బౌలర్లు నిలవకపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే వారు చేసిన అతి పెద్ద తప్పని కాసేపటికే అర్థమైంది. బ్యాటింగ్ దిగిన బరిశల్ బ్యాటర్లు అది నుంచే ఎదురుదాడికి దిగారు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లుగా బౌండరీలు బాదుతుంటే బౌలర్లు, ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర వహించారు. ఇఫ్తిఖర్ అహ్మద్ శతకం బాధగా, బంగ్లా ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ 43 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. రంగాపూర్ రైడర్స్ లో పాక్ బౌలర్లు మహ్మద్ నవాజ్, హ్యారిస్ రౌఫ్ ఉన్నప్పటికీ.. వీరిద్దరూ యువ బౌలర్లను టార్గెట్ చేసుకొని రెచ్చిపోయారు.
BPL T20 2023: Match day 09
Match 18: Fortune Barishal vs Rangpur RidersIftikhar Ahmed knocks a century!
Watch the match Live on Daraz app: https://t.co/Fisx68v30S & Nagorik TV#BPL | #BCB | #Cricket pic.twitter.com/xz5Okj9ccQ
— Bangladesh Cricket (@BCBtigers) January 19, 2023
దీంతో బరిశల్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. రైడర్స్ బౌలర్లలో హసన్ మహ్మద్ 2 వికెట్లు, హ్యారిస్ రౌఫ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన మాలిక్ సేన 70 పరుగులకే కోల్పోయి పోరాడుతోంది. రైడర్స్ విజయానికి 63 బంతుల్లో 169 పరుగులు కావాలి. ఇఫ్తిఖర్ అహ్మద్ ఇన్నింగ్స్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.