భీకర బ్యాటింగ్ లైనప్.. వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం.. ఇదీ ఆసియా కప్ కు బయలుదేరే ముందు భారత్ పై సగటు క్రికెట్ అభిమానులకు ఉన్న అంచనా. ఈ క్రమంలోనే ఆసియా కప్ ప్రారంభం అయ్యింది. పాక్ పై, హాంకాంగ్ పై విజయాలతో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిందని ప్రత్యర్థి జట్లకు అర్ధం అయ్యింది. అదే ఊపులో సూపర్-4 లోకి అడుగు పెట్టిన టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. వరుసగా పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓటములు చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటముల నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్వీటర్ లో బాయ్ కాట్ IPL అంటూ హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్ 2022లో భారత్ వరుస ఓటములు.. దాంతో బాయ్ కాట్ IPL అంటూ పోస్టులు.. అసలు దీనికీ దానికీ సంబంధం ఏంటీ? ఉండదని కొందరు అంటే.. ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. మనిషి జీవితంలో ప్రతీ పని మరో పనితో ముడిపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని కొన్ని విషయాలకు కాలంతో అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే ఐపీఎల్ కు ఆసియా కప్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఐపీఎల్ కు భారత ఆటగాళ్లకు మాత్రం లింక్ ఉంది. టీమిండియా ఆటగాళ్లు ప్రతీ ఐపీఎల్ లో దుమ్ము రేపుతారు.. అందులో భాగంగానే ఈ టోర్నీ ద్వారా కొత్త కొత్త యువ ఆటగాళ్లు వెలుగు లోకి కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో వరల్డ్ క్లాస్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఉన్న జట్టు అని చెప్పుకునే టీమిండియా 170-180 పరుగులను కూడా కాపాడుకోలేకపోవడం ఏంటని మండిపడుతున్నారు.
ఇప్పడు అసలైన ప్రశ్న ఏంటంటే? ఐపీఎల్ లో ఆడినంత బాగా అంతర్జాతీయ మ్యాచ్ లల్లో టీమిండియా ఆటగాళ్లు ఎందుకు ఆడట్లేదనేదే సమాధానం లేని ప్రశ్న. ఈ క్రమంలోనే భారత్ వరుసగా పాకిస్థాన్ పై శ్రీలంకపై ఓడిపోవడం సగటు క్రీడాభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదంతా ఐపీఎల్ కారణంగానే అని దుమ్మెత్తిపోస్తున్నారు. అక్కడ కోట్లకు కోట్లు తీసుకుని బాగా ఆడుతున్నారు. మరి దేశం కోసం.. దేశ పరువు ప్రతిష్టల కోసం ఇక్కడ ఇంకెంత బాగా ఆడాలి.. అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఆటగా మాత్రమే చూడరు అదొక ఎమోషన్. అందుకే ఇండియాలో క్రికెట్ కు అంత క్రేజ్. ప్రస్తుతం ట్విటర్ లో ఈ బాయ్ కాట్ IPL అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. మరి సగటు క్రికెట్ అభిమానుల బాధను కూడా పరిగణంలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరి బాయ్ కాట్ ఐపీఎల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#boycottipl
This is what happens when u have too many expectations on nations match just play ipl and generate money pic.twitter.com/83Ti8JYrmo— NihaL Vaishya 🇮🇳 (@VaishyaNihal) September 6, 2022
The day from which Indian Public Stop watching IPL the day from. That this Useless team start playing for the country & pride not running for the money
Same happens in the T20 WC #boycottipl pic.twitter.com/oOIGpX6XsN
— 💫 ͡K͎ ͜ᴀ ʀ ͡ ͜ᴛ ʜ 𝚒 ͡💫🇮🇳 (@its_karthikoff) September 7, 2022
Team like this …Never Before Ever After..
A perfect team for Country..
#BoycottIPL #IndianCricketTeam @BCCI pic.twitter.com/gnHRw2kjWo— Prince Of Hearts _ Ganesh 🔔 (@PrinceO45469703) September 7, 2022