తిరువనంతపురం వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అది అలాంటి ఇలాంటి విజయం కాదు.. ప్రపంచ రికార్డు విజయం. 317 పరుగుల భారీ తేడాతో గెలిచి.. వన్డే చరిత్రలోనే కొత్త రికార్డును నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 390 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుబ్‌మన్ గిల్(116), విరాట్ కోహ్లీ(166 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో భారీ స్కోర్ సాధమైంది. ఇక బౌలింగ్‌లో మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో చెలరేగడంతో.. లంక 73 పరుగులకే కుప్పకూలింది. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో అతి పెద్ద విజయం సాధిస్తూ.. భారత జట్టు చరిత్ర సృష్టించింది.
కాగా.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ చమిక కరుణరత్నే అవుటైన విధానం మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. అప్పటికే వరుసగా వికెట్లు తీస్తూ.. లంకను వణికిస్తున్న సిరాజ్.. తన బౌలింగ్‌తోనే కాకుండా.. సమయస్ఫూర్తితో కూడా అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎంతలా అంటే.. సిరాజ్ ప్రదర్శనకు ఫిదా అయిన కెప్టెన్ రోహిత్ శర్మ కప్పు తీసుకొచ్చి సిరాజ్ చేతుల్లో పెట్టేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసేందుకు కోహ్లీ, గిల్ బ్యాటింగ్ కారణమైతే.. టీమిండియాకు వరల్డ్ రికార్డు అందించిన ఘనత మాత్రం సిరాజ్‌దే. తొలి ఓవర్ నుంచి లంక బ్యాటర్లను షేక్ చేస్తూ.. వరుసగా వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 22 ఓవర్లు సాగితే.. అందులో 10 ఓవర్లు సిరాజే వేశాడు. తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన సిరాజ్ కేవలం 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టమే కాకుండా.. ఒక అద్భుతమైన రనౌట్ చేశాడు. నిజానికి అది రనౌట్ కూడా కాదు.. దానికి కొత్తగా ‘సిరాజ్ స్టంట్’ అని పేరు పెట్టాలి.
ఎందుకంటే.. చమిక కరుణరత్నేను సిరాజ్ అవుట్ చేసిన విధానం అలా ఉంది. లంక ఆటగాళ్లుతో పాటు టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సైతం ఆ ఔట్ నుంచి షాక్ అయ్యాడు. ఈ అద్భుతం సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో చోటు చేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని కరుణరత్నే డిఫెన్స్ ఆడాడు. అది సిరాజ్ చేతుల్లోకి వచ్చింది. ఆ బంతిని అందుకున్న సిరాజ్.. అనూహ్యంగా బ్యాటర్ ఎండ్ వైపు ఉన్న వికెట్లకు గన్‌షాట్ త్రో వేశాడు. అది నేరుగా వికెట్లు తాకడంతో.. స్లిప్‌లో ఉన్న నలుగురు భారత్ ఆటగాళ్లు షాకై.. సంబురాల్లో మునిగితేలారు. అయితే.. రిప్లేలో కరుణరత్నే.. ఒక ఇంచు క్రీజ్ బయట ఉండటంతో అతన్ని ఔట్‌గా ప్రకటించారు.
అయితే.. బ్యాటర్ రన్ కోసం ప్రయత్నించలేదు. కానీ.. అతను క్రీజ్ బయట ఉన్నాడని పసిగట్టిన సిరాజ్.. అద్భుత త్రోతో అవుట్ చేశాడు. బ్యాటర్లు రన్ కోసం ప్రయత్నించి కొంత ముందుకు వచ్చిన సందర్భాల్లో బౌలర్లు బాల్ అందుకుని రనౌట్ చేసిన మ్యాచ్‌లు ఉన్నాయి కానీ.. ఇలా డిఫెన్స్ ఆడి అక్కడి ఉన్న బ్యాటర్‌ను రనౌట్ చేసిన దాఖలా లేదు. నిజానికి కరుణరత్నే అవుటైన పరిస్థితి చూస్తే.. ఎవరికీ అది రనౌట్‌లా అనిపించదు. క్లీన్‌బౌల్డ్ అనో.. లేదా స్టంప్ అవుట్‌లా కనిపిస్తుంది. కానీ.. అది రనౌట్. సిరాజ్ చేసిన అద్భుతానికి ఫలితంగా దక్కిన రనౌట్. మరి ఈ అవుట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Four wickets to go with one run-out!
You can’t keep @mdsirajofficial out of action 😃
Sri Lanka 40/6 after 12 overs.
Follow the match ▶️ https://t.co/q4nA9Ff9Q2…… #TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/Gw405Ey8YP
— BCCI (@BCCI) January 15, 2023