భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వరల్డ్ కప్ జరుగనున్న సంగతి సంగతి తెలిసిందే. జింబాబ్వే ప్రస్తుతం వీటికి సంబంధిన క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇక ఈ మ్యాచులో వెస్టిండీస్ జట్టుకి ఒక పసికూన జట్టు ఉహించని షాకిచ్చింది.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ లో వరల్డ్ కప్ జరుగనున్న సంగతి సంగతి తెలిసిందే. జింబాబ్వే ప్రస్తుతం వీటికి సంబంధిన క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. వచ్చే నెల 9 వరకు ఈ మ్యాచులు జరగనుండగా..అన్ని జట్లు లీగ్ మ్యాచులు ఆడేస్తున్నాయి. దీనిలో భాగంగా పసి కూన జట్టు జింబాబ్వే నేడు సంచలన విజయం నమోదు చేసింది. పటిష్టమైన విండీస్ జట్టుని మీద సమిష్టిగా ఆడి విజయం నమోదు చేసింది. వరుసగా మూడో విజయంతో జింబాబ్వే సూపర్ సిక్స్ రేసులో ముందడుగు వేసింది. గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. నెదర్లాండ్స్ జట్టు 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే నెట్‌రన్ రేటులో వెనకబడిన విండీస్ మూడో ప్లేస్‌కు పడిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే..
హరారే వేదికగా వెస్టిండీస్-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచులో పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. పసికూన జట్టు అని తేలికగా తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో విండీస్ కి తెలిసి వచ్చింది. అసలే వరల్డ్ కప్ కి అర్హత సాధించని విండీస్ ఇప్పుడు జింబాబ్వే రూపంలో గట్టి షాక్ తగిలింది. ఇక ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 50 ఓవర్లు ఆడకుండానే 268 పరుగులకే ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ సికందర్ రాజా(68) బారెల్ (50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో విండీస్ సులభంగానే గెలిచేస్తుంది అనుకున్నారంతా. కానీ 233 పరుగులకే ఆలౌట్ అయిపోయి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ఉంది.
విండీస్ జట్టులో కైల్ మేయర్స్ అర్ధ సెంచరీతో రాణించినా.. మిగిలిన వారెవరు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. సొంతగడ్డపై చిరస్మరనీయ విజయాన్ని అందుకున్న జింబాబ్వే .. అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది. ఈ మ్యాచులో జింబాబ్వే ఆడియన్స్ వీరికి సపోర్ట్ చేసిన విధానం చూస్తుంటే ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. వికెట్ పడినప్పుడల్లా గ్రౌండ్ లో అంతా మారు మ్రోగింది. మొత్తానికి వరల్డ్ క్వాలిఫయర్స్ లో తొలి సంచలనం నమోదయింది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.