టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మంచి పేస్ బౌలర్. సీమ్ ప్రజెంటేషన్ కచ్చితంగా ఉంటుంది. ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లతో బ్యాటర్ల బోల్తాకొట్టించడంలో భువీ దిట్టా. కానీ.. స్పీడ్ విషయంలో మాత్రం అంతగా ప్రభావం చూపలేడు. ఇది ఇప్పటి వరకు భువీపై సగటు క్రికెట్ అభిమానికి తెలిసిన విషయం. స్పీడ్ బౌలింగ్ అంటే అందరికి పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్, ఆసీస్ స్పీడ్‌స్టర్ బ్రెట్‌లీ, సౌతాఫ్రికా స్పీడ్‌గన్ డేల్ స్టెయిన్ గుర్తుకువస్తారు. ప్రస్తుత క్రికెట్‌లో న్యూజిలాండ్ పేసర్ ఫెర్గూసన్, ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మంచి స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నారు. ఐపీఎల్‌తో మన ఇండియన్ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్ ఏకంగా గంటకు 157 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ వేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రపంచ క్రికెట్‌లో షోయబ్ అక్తర్ పేరున చెక్కు చెదరకుండా ఉన్న ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును ఉమ్రాన్ మాలిక్ భవిష్యత్తులో బద్దలు కొట్టేలా కనిపించాడు.
కానీ.. ఉమ్రాన్ మాలిక్, అక్తర్ వేసిందే అసలు స్పీడ్ బౌలింగ్గే కాదు అన్నట్లు.. భువనేశ్వర్ కుమార్ ఐర్లాండ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఏకంగా గంటకు 208 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందర్ని ఆశ్యర్యానికి గురిచేశాడు. 161.3 వేగంతో షోయబ్ అక్తర్ వేసిన బంతే ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు భువీ 208 స్పీడ్‌తో ఆ రికార్డు గల్లంతు అయినట్లు ఇండియన్ ఫ్యాన్స్ సంబురపడ్డారు. కానీ వారి సంతోషం అంతలోనే ఆవిరైంది. పేస్ కంటే స్వింగ్‌పైనే ఎక్కువ ఆధారపడే భువీ ఇంత స్పీడ్‌తో బౌలింగ్ వేశాడా? అనే అనుమానం అందరిలో ఉన్నా.. స్పీడో మీటర్‌పై 208 కేఎంపీహెచ్ చూపించడంతో అంతా నిజమనుకున్నారు. కానీ.. అది స్పీడో మీటర్ తప్పిదం వల్ల అలా చూపించిందని తెలిసి నవ్వుకున్నారు.
ఇక మీమర్లు ఈ ఘటనపై దారుణంగా స్పందిస్తున్నారు. స్పీడో మీటర్ చూపించిన 208 నంబర్‌ను స్క్రీన్‌షాట్లు తీసి.. సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ తన స్పీడ్‌తో అక్తర్‌ను ఆరేశాడని, ఉమ్రాన్ మాలిక్‌ను ఊదేశాడంటూ జోకులు పేలుస్తున్నారు. భువీ స్పీడ్ ముందు ఉమ్రాన్ మాలిక్ బచ్చా అంటూ మీమ్స్ వేస్తున్నారు. వరల్డ్ రికార్డు బద్దలైందంటూ స్పీడ్ మీటర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ (1/16), యుజ్వేంద్ర చాహల్ (1/11) ప్రత్యర్థిని కట్టడి చేశారు. హ్యారీ టెక్టార్ ( 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 నాటౌట్) ఐర్లాండ్‌కు మెరుగైన స్కోరును అందించాడు. అనంతరం దీపక్ హుడా ( 29 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స్‌లతో 47 నాటౌట్), ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26 ), హార్దిక్ పాండ్యా ( 12 బంతుల్లో ఫోర్, మూడు సిక్స్‌లతో 24) చెలరేగడంతో భారత్.. 9.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్ (2/18) ఒక్కడే ప్రభావం చూపించాడు.
సిరీస్‌లో చివరిదైన రెండో టీ20 మంగళవారం జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో స్పీడో మీటర్ తప్పిదంతో భువీ 208 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ వేసినట్లు చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
WORLD RECORD❗
bhuvneshwar kumar delivered a ball at 201 KMPH. Fastest ball of cricket history. Sheering pace from bhuvi 🔥#IREvIND #indvsire pic.twitter.com/sz3JDz1Vzu
— Rohit.Bishnoi (@The_kafir_boy_2) June 26, 2022
Bhuvneshwar Kumar was bowled at 200+ KPH during the 1st T20 against Ireland at Dublin. #IREvIND pic.twitter.com/ZnIJAHYf1z
— Cricket insect (@000insect) June 27, 2022
WORLD RECORD BROKEN
Bhuvi broken his own record by bowling at 208 kmph. Bhuvi launching rockets today. This is unbelievable#indvsire #IREvIND pic.twitter.com/FFvzLGfPsN
— Rohit.Bishnoi (@The_kafir_boy_2) June 26, 2022