మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దయ్యింది. ఈ విషయం క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించింది. 2-1తో ఆధిపత్యంలో ఉన్న టీమిండియా కచ్చితంగా సిరీస్‌ను సొంతం చేసుకుంటుందనే అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జరిగి ఉండేది కూడా. కానీ కరోనా కారణంగా ఆఖరి టెస్టును ఇరు బోర్డులు ఏకాభిప్రాయంతో మాంచెస్టర్ టెస్టును రద్దు చేశాయి. ఈ టెస్టు అటు ఇంగ్లాండ్, ఇటు బీసీసీఐకి భారీ నష్టాన్ని కూడా మిల్చింది. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆఖరి టెస్టును రీషెడ్యూల్ చేయాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే గంగూలీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఆఖరి టెస్టును నిర్వహిచేందుకు ఆసక్తిగా ఉంది. అదే అంశంపై ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతోనూ బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది. అందుకు సంబంధించి చర్చలు జరిపేందుకు గంగూలీ సెప్టెంబర్ 22న ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, అక్కడి ప్రసార హక్కుదారులతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆఖరి టెస్టు రద్దవడం వల్ల ఇంగ్లాండ్‌కు దాదాపు రూ.300 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. బీసీసీఐకి కూడా భారీ నష్టమే వాటిల్లుతుంది. రవిశాస్త్రి సహా కోచ్‌లు, సహాయ సిబ్బందిలో పలువురు కోరనా బారినపడటంతో ఆఖరి టెస్టును రద్దు చేసేందుకు నిర్ణయించుకున్నారు. 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్నా.. ఆఖరి టెస్టు జరగకపోవడం వల్ల సిరీస్ ఫలితం కూడా తేలలేదు.