సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో మైదానంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. లవర్స్ ప్రపోజ్ చేసుకోవడం, ఆటగాళ్లపై ఫ్యాన్స్ తమ ప్రేమను ప్లకార్డుల ద్వారా తెలియజేయం, లిప్ లాక్ ముద్దులు పెట్టుకోవడం లాంటి ఘటనలు చరిత్రలో మనం చాలా చూశాం. కాని ఇప్పుడు చెప్పుకొబోయే వార్త గురించి మీరింత వరకు విని, చూసి ఉండరు. ఈ సంఘటన యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ టీ20 లీగ్ లో చోటుచేసుకుంది. బౌండరీ వెళ్తున్న బాల్ ను ఆపే క్రమంలో కింద పడ్డ ఫీల్డర్ కు సాయం చేశాడు బాల్ బాయ్. ఆ బుడ్డోడు చేసిన పనికి డైవ్ చేసిన ఫీల్డర్ కూడా బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ బుడ్డోడు చేసిన సాయం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రస్తుతం యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ లీగ్ లో స్టార్ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. ఫోర్లు, సిక్సర్లలతో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. తాజాగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అబుదాబీ నైట్ రైడర్స్ వర్సెస్ డిసర్ట్ వైపర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. డిసర్ట్ వైపర్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. సునీల్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బ్యాటర్ బంతిని ఆఫ్ సైడ్ ఫుల్ చేశాడు. ఆ బంతిని ఆపడానికి ఎంతో ట్రై చేశాడు రైడర్స్ ఫీల్డర్ సాబీర్ అలీ. చివరికి బౌండరీ లైన్ వద్ద బాల్ ను డైవ్ చేసి ఫోర్ వెళ్లకుండా ఆపాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడే అసలైన సంఘటన జరిగింది.
ఈ క్రమంలోనే డైవ్ చేసి లేచి వచ్చిన ఫీల్డర్ కు గ్రౌండ్ లో ఉన్న బంతిని తీసుకుని అందించాడు అక్కడే ఉన్న బాల్ బాయ్. ఆ బుడ్డ బాల్ బాయ్ బాల్ అందివ్వడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యాడు ఫీల్డర్ సాబీర్ అలీ. కింద పడ్డ ఫీల్డర్ కు సాయం చేయాలన్న ఆ బుడ్డోడి తపనకు అందరు మెచ్చుకుంటున్నారు. అయితే అతడికి రూల్స్ తెలీకే అలా చేశాడు పాపం పసివాడు అని మరికొందరు అంటున్నారు. ఇక ఈ విషయంపై అంపైర్లు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. బాల్ ను కూడా బౌండరీ ఇవ్వలేదు. అయితే అందరు బాల్ ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడి వైపు చూస్తూ.. కొందరు ఆటగాళ్లు నవ్వులు చిందించారు. ఇక ఈ మ్యాచ్ లో డిసర్ట్ వైపర్స్ 7 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ ను ఓడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బుడ్డోడు ఫీల్డర్ కు బాల్ అందివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) January 20, 2023