క్రికెట్‌లో వింత వింత పనులు చేయాలంటే పాకిస్థాన్ క్రికెటర్ల తర్వాతే.. పొరపాటుగా చేస్తారో, అది వారి అలవాటో గానీ.. ప్రతి సారి నవ్వుల పాలవుతుంటారు. క్రికెట్ రూల్స్ తెలియకుండా అంపైర్‌తో వాదనలు పెట్టుకుంటూ.. టెస్టులో 15 ఓవర్లకు 138 పరుగుల టార్గెట్ ఇస్తూ.. ఇప్పుడు ఒక రనౌట్ విషయంలో పాక్ ఆటగాళ్లు నవ్వుల పాలయ్యారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్థాన్‌తో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి టెస్టును డ్రా చేసుకున్న పాక్.. రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు భారీ స్కోర్ సమర్పించుకుంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేసింది. పాకిస్థాన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 393 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 115 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ హస్యాస్పదరీతిలో అవుట్ అయ్యాడు. 56 పరుగులకే పాక్ రెండు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ బాబర్ అజమ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బాబర్-ఇమామ్ జోడి ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో ఆ జోడీని వీడదీసేందుకు న్యూజిలాండ్‌కు అవకావం ఇవ్వకుండా ఆ బాధ్యతను తమకు తామే తీసుకున్నారు.. బాబర్-ఇమామ్. మిచెల్ బ్రాస్‌వెల్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి ఇమామ్ ఉల్ హక్ బంతిని మిడ్ వికెట్ దిశగా ఆడాడు.. బాల్ వెనుక నికోలస్ పరిగెత్తాడు. ఈ గ్యాప్‌లో రెండు పరుగులు పూర్తి చేసుకున్నారు.. బాబర్-ఇమామ్ జోడీ. అయితే.. బాబర్ మూడో పరుగు కోసం ప్రయత్నించాడు. తొలుత ఇమామ్ ఉల్ హక్ సైతం రన్‌కు కాల్ ఇచ్చి తర్వాత ఆడిపోయాడు.
దీంతో ఇద్దరి మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగి ఇద్దరూ బ్యాటింగ్ సైడ్ క్రీజ్‌లోకి చేరుకున్నారు. అప్పటికే బాల్ అందుకున్న నికోలస్.. బౌలర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ బ్రాస్‌వెల్‌కు బాల్ అందించగా.. అతను వికెట్లను గిరాటేయడంతో.. బాబర్ రనౌట్ అయ్యాడు. తాను నో చెప్పిన బాబర్ రన్ కోసం రావడంపై ఆగ్రహించిన ఇమామ్ ఉల్‌హక్ కెప్టెనే తిట్టిపోశాడు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇక చేసేదేం లేక బాబర్ క్రీజ్ వదిలి.. పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. ఆశ్చర్యకరంగా రన్స్ తీసేటప్పుడు కనీసం ఒకరినొకరు చూసుకోకుండా పరిగెత్తడమే ఇక్కడ పాక్ వికెట్ కోల్పోవడానికి కారణమైంది. ఇద్దరు కుదరుకున్నారు అని భావించేలోగా.. నవ్వు తెప్పించే విధంగా రనౌట్ అయ్యి పాక్‌ను మళ్లీ కష్టాల్లో పడేశారు. ఆ తర్వాత సౌద్ షకీల్ సెంచరీతో చెలరేగడంతో పాక్ మంచి స్కోర్ దిశగా సాగుతోంది. మరి ఈ మ్యాచ్‌లో బాబర్ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Babar Azam run-out funny😂#PakvsNZ #PAKvNZpic.twitter.com/sYfutPFeqe
— TATA IPL (@TATA_IPL) January 3, 2023
Saal Naya , Harkatein wahi!!!
Just Pakistan thing!
Babar Azam involved in funny run-out!#PAKvNZ#PAKvsNZ pic.twitter.com/TbR1llbHW6
— Nilesh G (@oye_nilesh) January 3, 2023