పిచ్ వేరు.. బ్యాటర్ వేరు.. కానీ సేమ్ బాల్.. సేమ్ రియాక్షన్. ఒక విధంగా చెప్పాలంటే 2019లో తీసిని వికెట్‌కు 2022లో రిప్లే చూసినట్టు ఉంది. అవును నిజం.. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ మార్కరమ్‌ను అవుట్ చేసిన విధానం.. 2019లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను అవుట్ చేసిన తీరు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నాయి. దీంతో కుల్దీప్ స్పిన్ మాయాజాలం ముందు బాబర్ అజమ్ అయినా.. మార్కరమ్ అయినా ఒక్కటే అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. వారిద్దరూ అవుటైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుల్దీప్ బాల్‌ను అర్థం చేసుకోవడంలో అప్పుడు బాబర్ విఫలం అయితే ఇప్పుడు మార్కరమ్ ఫెయిలైయ్యాడు. పైగా ఇద్దరి రియాక్షన్ కూడా ఒకేలా ఉండటం మరింత విశేషం.
2019 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా రోహిత్ శర్మ సెంచరీ, కోహ్లీ, రాహుల్ హాఫ్ సెంచరీలతో 300 పైచిలుకు భారీ స్కోర్ చేసింది. లక్ష్యఛేదనకు దిగిన పాక్‌ను కుల్దీప్ యాదవ్ ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా బాబర్ అజమ్‌ను అవుట్ చేసిన డెలవరీ అయితే మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆఫ్ స్టంప్ ఆఫ్ సైడ్ పడిన బంతి గిర్రున తిరిగి వికెట్లను గిరాటేసింది. బాబర్ ప్యాడ్, బ్యాట్ మధ్య నుంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. ఈ సూపర్ డెలవరీకి క్లీన్ బౌల్డ్ అయిన బాబర్.. షాకై అలానే చూస్తూ ఉండిపోయాడు. వికెట్ పడినా పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోని టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సైతం.. కుల్దీప్ బాబర్‌ను అవుట్ చేసిన బంతికి ఫిదా అయిపోయాడు.
ఇక తాజా మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన కుల్దీప్ తొలి బంతికి డికాక్‌కు సింగిల్ ఇచ్చాడు. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన మార్కరమ్‌ను తన స్పిన్‌తో ఇబ్బంది పెట్టిన కుల్దీప్.. పక్కా ప్లాన్ ప్రకారం వరుసగా నాలుగు డాట్ బాల్స్ ఆడించి మార్కరమ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక చివరి బంతిని గింగిరాలు తిప్పిగా.. ఎక్కడో ఆఫ్‌స్టంప్ ఆఫ్ సైడ్ పడిన బంతి గిర్రున తిరుగుతూ.. మార్కరమ్ ప్యాడ్, బ్యాట్ మధ్య చిన్న సందులోంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఈ అద్భుతమైన బంతికి మార్కరమ్ షాక్ అయ్యాడు. అసలు తాను అవుటైన విషయాన్ని కొద్ది సేపు నమ్మలేక అసలు బాల్ ఎటునుంచి ఎటు వెళ్లింది అన్నట్లు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇలా ఇప్పటి వరకు కుల్దీప్‌ను నాలుగు మ్యాచ్‌ల్లో ఎదుర్కొన్న మార్కరమ్.. ఏకంగా మూడుసార్లు అతనికే వికెట్ సమర్పించుకున్నాడు. కుల్దీప్ బౌలింగ్‌లో 18 బంతులు ఆడిన మార్కరమ్ కేవలం 5 పరుగులు చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు.
What a beautiful delivery from Kuldeep Yadav, gets Aiden Markram. 🔥😉#INDvSA #kuldeepyadavpic.twitter.com/uCHJ4qSM1D
— Shivam Jaiswal (@7jaiswalshivam) October 6, 2022
Absolute Beauty! 🙌
Kuldeep Yadav gets Aiden Markram out with a ripper!#INDvSA pic.twitter.com/QgMe7DRvcF
— CricTelegraph (@CricTelegraph) October 6, 2022
Easy for kuldeep yadav
You beauty 🔥😍#kuldeepyadav #IndvsSAodi #BabarAzam #markram #CricketTwitter pic.twitter.com/2qjyyn8F3u
— 👑 Virat , Rahul , Rohit 👑 (@mani_muzic) October 6, 2022
Kuldeep Yadav bowled a magical delivery to get rid of Aiden Markram. It was a similar delivery to the one he bowled against Babar Azam in 2019.#INDvSA | #TeamIndia | #KuldeepYadav pic.twitter.com/P5jujMfLFg
— SportsViz (@viz_sports) October 7, 2022
ఇది కూడా చదవండి: వీడియో: ఫీల్డర్లు క్యాచులు మిస్ చేస్తుంటే.. ఔరా అనిపించే క్యాచ్ పట్టిన బాల్ బాయ్!