ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వరుస పరాజయాలతో పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. అయితే మొదట పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలవ్వటంతో భారత్ ఆటగాళ్లపై నెటిజన్స్ కాస్త ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనైన ఇండియా గెలుస్తుందని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ఈ మ్యాచ్ లో కూడా కనీస స్థాయి ప్రదర్శనకు నోచుకోకుండా ఘోరంగా ఓటమి పాలైంది.
అయితే ఇక మరో విషయం ఏంటంటే..? కివీస్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరుకాలేదు. ఇంతటితో ఆగకుండా జస్ప్రీత్ బుమ్రాను ప్రెస్ కాన్ఫరెన్స్ కు పంపించారు. అయితే ఇదే విషయంపై తాజాగా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లీపై కాస్త ఫైర్ అయ్యారు. ఓటమి సర్వసాధారణమని కానీ వివరణ ఇవ్వకుండా ప్రెస్ కాన్ఫరన్స్ దూరంగా ఉండటమేంటంటూ ఇద్దరిపై మండిపడ్డారు. జర్నలిస్ట్ లు వేసే ప్రశ్నలకు సిద్దంగా ఉండాలని ఓటమికి చింతించాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా మీరు రాకుండా జస్ప్రీత్ బుమ్రాను ప్రెస్ కాన్ఫరెన్స్ కు పంపించటమేంటంటూ ప్రశ్నించారు. ఇలా చెయటం ఎంత వరకూ కరెక్ట్ కాదని అజారుద్దీన్ ఘాటుగా స్పందిచారు.