పాక్ సూపర్ లీగ్ లో నిజంగా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఆజమ్ ఖాన్ అనే బ్యాటర్.. తన తండ్రి కోచింగ్ ఇస్తున్న జట్టుపై దంచికొట్టే బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అభిమానులకు కావలసినంత వినోదం దొరుకుతోంది. సరిగ్గా రెండు రోజుల క్రితం ముల్తాన్ సుల్తాన్ బ్యాటర్ రిజ్వాన్ సెంచరీ చేసి అభిమానులని అలరించగా.. ఇప్పుడు ఇస్లామాబాద్ యునైటెడ్ బ్యాటర్ ఆజమ్ ఖాన్ తుఫాన్ లాంటి ఇనింగ్స్ తో స్టేడియంని హోరెత్తించాడు. సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో మిస్ చేసుకున్న ప్పటికీ అతడి ఇన్నింగ్స్ చూస్తే కచ్చితంగా వావ్ అనాల్సిందే. భారీకాయుడు అయినప్పటికీ ఆజమ్ ఖాన్ సృష్టించిన విధ్వసం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం అజమ్ ఖాన్ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు ఈ సెంచరీ తన తండ్రి కోచింగ్ ఇస్తున్న జట్టుపైనే చేయడం ఇక్కడ మరో విశేషం. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మొయిన్ ఖాన్ పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్. 1990-2004 మధ్య పాకిస్థాన్ తరపున వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలందించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు కోచ్ గా పనిచేస్తున్నాడు. తన కొడుకు ఆజాం ఖాన్ కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే క్వెట్టా- ఇస్లామాబాద్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచులో అజమ్ ఖాన్ కేవలం 42 బంతుల్లో 97 పరుగులు చేసి చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఇందులో 9 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. 19 ఓవర్లలో హోస్నైన్ బౌలింగ్ లో ఒక మోకాలి మీద కూర్చోని ఆజాం ఖాన్ కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.
క్వెట్టా గ్లాడియేటర్స్ కోచ్ మొయిన్ ఖాన్ కళ్లముందే ఆయన కొడుకు అజామ్ ఖాన్ సిక్సులు, ఫోర్లు బాదటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కొడుకు ఇన్నింగ్స్ చూస్తూ మొయిన్ ఖాన్ ఎలాంటి ఎమోషన్స్ ని బయటపెట్టలేదు. అందరిలాగానే చప్పట్లతో అజమ్ ఖాన్ ఇన్నింగ్స్ ని అభినందించాడు. ఓవైపు కొడుకు బాగా ఆడినప్పటికీ మరోవైపు కోచ్ గా తన బాధ్యతలను మర్చిపోకుండా తన విధిని సక్రమంగా నిర్వర్తించాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచులో ఇస్లామాబాద్ యునైటెడ్ 63 పరుగుల తేడాదో ఘన విజయం సాధించింది. అజాం ఖాన్ కి తోడు అసిఫ్ అలీ అదరగొట్టేశాడు. మొత్తానికి అజాం ఖాన్ తన తండ్రి కోచింగ్ ఇస్తున్న జట్టుపైనే అద్భుతమైన బ్యాటింగ్ చేసి అందరితో శెభాష్ అనిపించుకుంటున్నారు. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Azam Khan smashed 97 runs from 42 balls including 9 fours & 8 sixes – one of the crazy knocks ever in PSL history.
This came against the team coached by his father. pic.twitter.com/ke1IfD69nc
— Johns. (@CricCrazyJohns) February 24, 2023
When you make your dad proud 🥹#SabSitarayHumaray l #HBLPSL8 l #QGvIU pic.twitter.com/9sVWHkOByQ
— PakistanSuperLeague (@thePSLt20) February 24, 2023