టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా మహిళా జట్టు గెలిచింది. ఈ టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. కెప్టెన్ మెగ్ లానింగ్ కూడా తన పేరిట వరల్డ్ రికార్డ్ నమోదు చేసుకోవడం విశేషం.
ఆస్ట్రేలియా అమ్మాయిలు అదరగొట్టారు. ఏకంగా ఆరోసారి టీ20 వరల్డ్ కప్ ని ముద్దాడారు. దక్షిణాఫ్రికాను ఓడించి ఈ అరుదైన ఘనత సాధించారు. దీంతో మహిళల క్రికెట్ లో కంగారూ జట్టు ఆధిపత్యానికి అడ్డులేకుండా పోయింది. బ్యాటుతో మూనీ, ఆల్ రౌండర్ ప్రదర్శనతో గార్డ్ నర్ మెరుపులు చూపించిన వేళ.. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోవడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. గెలిచి అవకాశం సృష్టించుకున్నప్పటికీ.. బలమైన ఆస్ట్రేలియా ముందు బెండ్ అవ్వక తప్పలేదు. సఫారీ జట్టులో లారా వోల్వార్ట్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. తమ జట్టుని విజేతగా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో కప్ కొట్టి చోకర్స్ అనే ట్యాగ్ ని పోగొట్టుకోవాలనుకున్న దక్షిణాఫ్రికాకు మళ్లీ నిరాశే ఎదురైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేప్ టౌన్ వేదికగా ఆదివారం ఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టులో బెత్ మూవీ (74), గార్డ్ నర్ (29) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 156/6 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. కంగారూ జట్టులోని ఆష్లీ, మెగాన్, డార్సీ బ్రౌన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. మూనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గార్డ్ నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో డబుల్ హ్యాట్రిక్ సాధించినట్లు అయింది. కంగారూ మహిళా జట్టుకు తిరుగులేకుండా పోయింది.
2009లో తొలి టీ20 ప్రపంచకప్ లో సెమీస్ చేరలేకపోయిన ఆస్ట్రేలియా మహిళా జట్టు.. తర్వాత ప్రతి టోర్నీలోనూ ఫైనల్ చేరింది. 2016లో వెస్టిండీస్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచిన ఆస్ట్రేలియా.. 2010, 2012, 2014, 2018, 2020తో పాటు ఇప్పుడు అంటే 2023లోనూ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ జట్టు ఖాతాలోనే 7 వన్డే వరల్డ్ కప్స్ కూడా ఉన్నాయి. తద్వారా ఓవరాల్ క్రికెట్ లోనే ఎక్కువ ఐసీసీ ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వరల్డ్ కప్స్ అన్నింటిలోనూ ఆస్ట్రేలియా టీమ్ లో ఎలీస్ పెర్రీ సభ్యురాలిగా ఉంది. అలానే కెప్టెన్ మెగా లానింగ్ 2014, 18, 20, 23 నాలుగు టీ20 ప్రపంచకప్ లతో పాటు 2022 వన్డే ప్రపంచకప్ గెలిపించిన సారథిగా చరిత్ర సృష్టించింది. ఎందుకంటే ఈమె తర్వాత రికీ పాంటింగ్ నాలుగు, ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు దక్కించుకున్న కెప్టెన్ గా ఉన్నారు. ఇలా కప్ కొట్టడంతో పాటు ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను ఆస్ట్రేలియా సాధించింది. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
The ICC Women’s #T20WorldCup 2023 Champions 🏆#AUSvSA #TurnItUp pic.twitter.com/VA40x0VCdl
— T20 World Cup (@T20WorldCup) February 26, 2023
Skipper Meg Lanning with one of her closest friends 😉#AUSvSA #T20WorldCup #TurnItUp pic.twitter.com/RDIgnnKMFP
— T20 World Cup (@T20WorldCup) February 26, 2023