ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా- పాక్ పోరులో భారత జట్టు విజయం సాధించిన సంగతి అందరకి తెలిసిందే. మ్యాచ్ ముగిసి 12 గంటలు గడిచినా, ఆ ఓటమి నుంచి ప్రత్యర్థి జట్టు ఇంకా తేరుకోనట్టుంది. నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ ఎలా గెలవాలా అన్నది మానేసి.. ఓటమికి ఎవరు బాధ్యత వహించాలంటూ లెక్కలేసుకుంటున్నారు. ఈ విషయంలో పాక్ మాజీ సారధి వసీం అక్రమ్ మరో అడుగు ముందుకేసి..బాబర్ ఆజమ్ చేసిన ఒక్క తప్పే పాకిస్తాన్ ఓటమికి కారణమని తెలిపాడు. ఇంతకీ ఏంటా తప్పు? ఆ వివరాలు..
భారత్-పాక్ మ్యాచ్ ను.. అభిమానులు ఎంత పర్సనల్ గా తీసుకుంటారో అందరికీ తెలుసు. కెన్యా, జింబాబ్వే లాంటి చిన్న దేశాలతో ఓడినా పర్లేదు కానీ, ఇండియా, పాకిస్తాన్ పై ఓడకూడదు.. పాకిస్తాన్, ఇండియాపై ఓడిపోకూడదు అన్నదే ఆయా దేశాల అభిమానుల కోరిక. అందుకు తగ్గట్లే దుబాయ్ వేదికగా జరిగిన భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి వరకు ఎవరిది గెలుపో.. ఎవరిది ఓటమో.. ఊహించనివ్వకుండా చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది. ఇలాంటి మ్యాచ్ లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఓ చిన్న తప్పు చేశాడని.. ఆ దేశ మాజీ సారధి వసీమ్ అక్రమ్ అన్నారు. అది గానీ బాబర్.. చేయకపోయుంటే.. పాక్ జట్టు గెలిచేదని అభిప్రాయపడ్డాడు.
Hardik Pandya is adjudged Player of the Match for his excellent all-round show as #TeamIndia win a thriller against Pakistan 👏🎉💥
Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/D7GnzdFmQf
— BCCI (@BCCI) August 28, 2022
ఇక అసలు విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 148 పరుగుల చేసినా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకునే దిశగా ఛేదనలో టీమిండియాని బాగానే కట్టడి చేసింది. కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న యువ బౌలర్ నసీమ్ షా రెండో బంతికే.. కేఎల్ రాహుల్ ని బౌల్డ్ చేసి పాక్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆపై.. కెప్టెన్ రోహిత్ శర్మ(12), విరాట కోహ్లీ (35) సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో నవాజ్ తో పూర్తి కోటా బౌలింగ్ చేయించకుండా.. మిగతా బౌలర్లతో వేపించి.. ఆఖరి ఓవర్ వేసేలా చేసాడు బాబర్ ఆజమ్. ‘ఈ మ్యాచ్ లో బాబర్ చేసిన పెద్ద తప్పు ఇదేనని..’ వసీమ్ అక్రమ్ అన్నాడు.
ఒకవేళ అతడితో 13/ 14వ ఓవర్ వేయించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. నవాజ్ బౌలింగ్ చేయకపోవడంతో హార్దిక్ పాండ్యా-జడేజా జోడి క్రీజులో కుదురుకున్నారు. అకాహారి ఓవర్ లో మిగతా లాంఛనాన్ని పూర్తి చేసి, భారత్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత జట్టు.. ఆసియాకప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తదుపరి మ్యాచులో ఆగష్టు 31న హాంగ్ కాంగ్ తో తలపడనుంది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The last 3 balls of the final over, view from the stadium. Enjoy and RT! #INDvsPAK #AsiaCup2022 #ViratKohli𓃵 #HardikPandya pic.twitter.com/oilopUTRQS
— the punisher (@thepunishertbd) August 28, 2022