టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్లు టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. నెహ్రా ఏంటి యూకే పీఎం ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకుంటుంది నిజమే.. సెహ్వాగ్ అలా ట్వీట్ చేసింది ఒక పాకిస్థాన్ కామెంటేటర్‌కు కౌంటర్‌గా. ప్రస్తుతం ఆ పాక్ కామెంటేటర్ చేసిన ట్వీట్, దానికి సెహ్వాగ్ ఇచ్చిన కౌంటర్ ట్విట్టర్‌ను ఒక ఊపుఊపేసుంది. అసలు ట్విట్టర్‌లో అకౌంట్ కూడా లేని ఆశిష్ నెహ్రా ఏం చేయకుండానే ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారాడు.
దీనంతటికి కారణం.. పాక్ కామెంటేటర్ జైద్ హమిద్ చేసిన ట్వీట్. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌త్రో విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రాను ఆశిష్ నెహ్రాగా హమిద్ పొరపడటమే ఈ మొత్తం హిలెరియస్ ఎపిసోడ్‌కు కారణం. భారత్‌కు కౌంటర్ ఇస్తున్నట్లు చేసిన ట్విట్‌లో భారీ తప్పు చేసిన నవ్వుల పాలయ్యాడు హమిద్. ఇటివల బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2022 జరిగిన విషయం తెలిసిందే. ఈ గేమ్స్‌లో జావెలిన్‌త్రో విభాగంలో అర్షద్ నదీమ్ పాకిస్థాన్ తొలి గోల్డ్ మెడల్ అందించాడు.
అతన్ని ప్రశంసిస్తూ.. ఇది కదా అసలైన విజయం. ఒలింపిక్స్‌లో నదీమ్‌ను ఓడించిన భారత జావెలిన్ హీరో నీరజ్‌చోప్రాను కామన్వెల్త్‌లో నదీమ్ మట్టికరిపించాడు. ఇది హమిద్ ఉద్దేశం కానీ.. నీరజ్ చోప్రా పేరుకు బదులు ఆశిష్ నెహ్రా అని పేర్కొన్నాడు. దీంతో నెటిజన్లు అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఏకంగా.. ‘చిచ్చా.. ఆశిష్ నెహ్రా యూకే పీఎం ఎన్నికల ప్రిపరేషన్లో ఉన్నాడు.. మీర కంగారు పడకండి..’ అంటూ దారుణంగా ట్రోల్ చేశాడు.
ఆశిష్ నెహ్రాను నీరజ్ చోప్రా అనుకోవడమే పెద్ద కామెడీ అనుకుంటే.. అసలు కామన్వెల్త్‌తో పాల్గొనని నీరజ్ చోప్రాను పాక్ అథ్లెట్ నదీమ్ ఓడించాడని హమిద్ పేర్కొనడం మరింత నవ్వు తెప్పిస్తుంది. గాయం కారణంగా నీరచ్ చోప్రా కామవ్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనని సంగతి తెలిసిందే. కాగా.. జైద్ హమిద్ ట్విట్టర్ అకౌంట్‌పై భారత్‌లో నిషేధం ఉంది. మరి హమిద్ ట్వీట్, దానికి సెహ్వాగ్ కౌంటర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chicha, Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections. So Chill 🤣 pic.twitter.com/yaiUKxlB1Z
— Virender Sehwag (@virendersehwag) August 11, 2022
— Naila Inayat (@nailainayat) August 10, 2022
ఇది కూడా చదవండి: వాళ్లు వాగుతూనే ఉంటారు.. నేను నా పని చేసుకుంటూ పోతా: శుభ్‌మన్ గిల్