విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బ్యూటీఫుల్ కపుల్. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ జోడీ.. ఇప్పుడు ఓ ఖరీదైన ఫామ్ హౌస్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. దాని కాస్ట్ తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అలీబాగ్. సముద్రతీరానికి ఆనుకుని ఉండే చిన్న టౌన్. ఆ చుట్టుపక్కల సెలబ్రిటీలు ఫామ్ హౌసులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే షారుక్ ఖాన్, రణ్ వీర్-దీపికా పదుకొణె లాంటి వాళ్లు అక్కడ బిల్డింగ్స్ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి విరాట్-అనుష్క కూడా చేరినట్లు తెలుస్తోంది.
వినాయక చవితి సందర్భంగా విరాట్-అనుష్క జంట.. అలీబాగ్ లోని ఓ ఖరీదైన ఫామ్ హౌజ్ కొన్నారు. అలీబాగ్ దగ్గర్లోని జిరాద్ గ్రామంలో 8 ఎకరాల భూమిని వీళ్లు కొనుగోలు చేశారు. దీని కోసం విరుష్క జోడీ.. రూ.19.24 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇది కాకుండా ప్రభుత్వానికి రూ.1.15 కోట్ల డిపాజిట్, రూ.3.35 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారని తెలుస్తోంది.
కోహ్లీ.. ప్రస్తుతం ఆసియాకప్ కోసం దుబాయ్ లో ఉండగా.. ఈ కొనుగోలు ప్రక్రియని విరాట్ తమ్ముడు వికాస్ కోహ్లీ పూర్తి చేశారు. ఇప్పుడీ స్థలంలో సముద్రాన్ని ఫేస్ చేస్తూ ఓ అందమైన బిల్డింగ్ నిర్మించనున్నారు. దీనికోసం కూడా ఈ జంట భారీగానే ఖర్చు చేయనుంది. ఈ బిల్డింగ్ అనుష్క టేస్ట్‌కు తగినట్లు ఉండనుంది.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత అనుష్క శర్మ.. భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ లో నటిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా క్రికెట్ ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. మరి విరాట్-అనుష్క కొత్త ఫామ్ హౌజ్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: మైదానంలో అనుష్కపై ముద్దుల వర్షం కురిపించిన విరాట్ కోహ్లీ!