తనను బలిపశువును చేస్తున్నారంటూ టీ20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్-రస్సెల్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు ఇష్టపడుతున్నారని, వారిని దేశం తరఫున ఆడమని బతిమాలుకోవాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రస్సెల్ స్పందించాడు.
”ఈ పరిస్థితి వస్తుందని నాకెప్పుడో తెలుసు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే మేలు” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న రస్సెల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘విండీస్ కోచ్ వ్యాఖ్యలపై నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటున్నా. గతంలొ జరిగిన చర్చల్లో చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నన్ను చెడ్డవాడిగా ప్రజెంట్ చేస్తూ.. బలిపశువును చేయాలని చూస్తున్నారు.
వెస్టిండీస్‌కు ఆడి రెండో ప్రపంచకప్‌ను గెలవాలని ఉంది. ఫ్రాంచైజ్‌లకు ఆడేటప్పుడు రెండు సెంచరీలు చేశా. నిజానికి ఇవి విండీస్ జట్టుకు ఆడినప్పుడు చేయాల్సినవి. ఆ రెండు సెంచరీలు విండీస్ తరఫున చేసి ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక స్థానం ఉండేది. ఎప్పుడూ జట్టు కోసం ఆడాలనేదే నా కోరిక. కానీ.. కొన్ని నిబంధనలు అంగీకరించలేం. వాళ్లు కూడా నా అభ్యర్థనను గౌరవిస్తే బాగుండేది. మాకూ కుటుంబాలు ఉన్నాయి. కెరీర్‌లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా వయస్సు 34 ఏళ్లు. ఇప్పటికీ విండీస్ కోసం ప్రపంచకప్‌లను గెలిపించాలని భావిస్తున్నా” అని రస్సెల్ వివరించాడు.
వెస్టిండీస్ తరఫున రస్సెల్ తన చివరి వన్డేను 2019లో ఆడగా.. ఆఖరి టీ20 గతేడాది ఆసీస్‌పై ఆడాడు. కానీ.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగుల్లో రెగుల్యర్‌గా ఆడుతున్నాడు. కేవలం ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే విండీస్ క్రికెటర్లు ప్రాంచైజ్‌లకు ఆడుతూ దేశానికి ఆడటం లేదనే విమర్శ ఉంది. మరి రస్సెల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Andre Russell still bleeds maroon!
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2022
“I want to win another World Cup” 🏆
Andre Russell talks about his West Indies future ⬇️https://t.co/m4MGXGENXH
— ICC (@ICC) August 17, 2022
ఇది కూడా చదవండి: వీడియో: జిడ్డుకు మారుపేరైన చంద్రపాల్ వణుకుతున్న చేతితోనే వండర్ చేశాడు!