టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఒక ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ముఖాలు కనిపించకుండా వెనకు తిరిగి నిల్చుని ఫొటో దిగారు. ఈ ఫొటోలో ఒక ప్రత్యేకత ఉంది. ఫొటోలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, న్యూజిలాండ్ ప్లేయర్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర ఉన్నారు. వాళ్ల జెర్సీ పేర్లు కలిపి చూస్తే ఇలా అక్షర్ పటేల్, రవీండ్ర జడేజా అని పూర్తిగా వస్తుంది. రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా జెర్సీ నంబర్లు కూడా ఒకటే కావడం విశేషం.
ఇలా ఫొటో దిగి న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇండియాపై, ఇండియన్ ప్లేయర్స్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర ఇద్దరూ భారతీయ సంతతికి చెందిన వారే. న్యూజిలాండ్‌లో స్థిరపడి అక్కడి జాతీయ జట్టుకు ఆడుతున్నారు. కాగా న్యూజిలాండ్‌తో ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ మొదటి ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అయినా కూడా మ్యాచ్ భారత్ గెలిచింది.
Picture perfect 👌
📸 @ashwinravi99 pic.twitter.com/av8LZdSAcZ
— ICC (@ICC) December 6, 2021