సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫస్ట్ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ గెల్చుకుంది. అరంగేట్ర టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ నెగ్గడంలో జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ పాత్ర ఎంతో ఉంది. అందుకే అతడికి ప్రమోషన్ ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ దుమ్మురేపింది. ఈ లీగ్‌లో ఫస్ట్ టైటిల్‌ను ఆరెంజ్ ఆర్మీ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగన ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. ఇక సెమీ ఫైనల్‌లో సెంచరీతో చెలరేగి టీమ్‌ను ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్.. మొత్తంగా 11 మ్యాచుల్లో 366 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. టోర్నీ ఆసాంతం తన ఆటతీరుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మార్క్‌రమ్.. జాక్‌పాట్ కొట్టేశాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సారథిగా మార్క్‌రమ్ ముందుండి నడపనున్నాడని సమాచారం.
ఎస్‌ఏ టీ20 లీగ్‌లో సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న మార్క్‌రమ్ .. కెప్టెన్‌గానూ తానేంటో నిరూపించుకున్నాడు. లీగ్ దశలో కొన్ని మ్యాచుల్లో ఓడిపోయిన టీమ్‌ను టైటిల్ విన్నర్‌గా నిలిపాడు. దీంతో అతడికి కావ్య మారన్ ప్రమోషన్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఐపీఎల్‌లోనూ అతడ్నే కెప్టెన్‌గా కొనసాగించాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఐపీఎల్ గత సీజన్‌లో సన్‌రైజర్స్‌కు సారథ్యం వహించిన కేన్ విలియమ్సన్‌ను యాజమాన్యం వదులుకుంది. మినీ వేలంలో హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్‌లను భారీ మొత్తం వెచ్చించి టీమ్‌లోకి తీసుకుంది.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న సన్‌రైజర్స్ కెప్టెన్సీ పోస్టు కోసం ఎయిడెన్ మార్క్‌రమ్ కరెక్ట్ అని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. మయాంక్ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అనుకున్నా.. పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టెన్‌గా అతడు పూర్తిగా నిరాశపర్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టైటిల్ గెలిపించిన మార్క్‌రమ్‌నే కెప్టెన్ చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే సన్‌రైజర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ విషయంపై ఎస్‌ఆర్‌హెచ్ త్వరలో క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. మరి.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఐపీఎల్‌లో మార్క్‌రమ్ సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
jfsdjbfesifisoaopdjaojfaojfoef 😭 pic.twitter.com/Hc2eM2bqIW
— Sunrisers Eastern Cape (@SunrisersEC) February 12, 2023
మాస్టర్ బ్రెయిన్ మన కావ్య మారన్ గారు ప్రతి ఆక్షన్ అప్పుడు ఆమె ని తిడతారు మనకి నచ్చిన ఆటగాళ్ళు లేరు ఏంటి అని కొన్ని రోజులు కి ఆమె అన్ని ఆలోచించే కొంటారు అని అర్ధం చేసుకుంటారు స్టార్లు కాదు జట్టు ని గెలిపించే వాళ్ళు ఉంటే చాలు అని #OrangeArmy #Kavyamaran #SunrisersEasternCape pic.twitter.com/6nGt3KHSKs
— ORANGE ARMY (@SUNRISERSU) February 12, 2023