ఆస్ట్రేలియా వేదికలో జరుగుతున్న ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్‌లో సంచలనం నమోదైంది. ఆ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేని టార్గెట్‌ను తొలిసారి అడిలైడ్ స్ట్రైకర్స్ ఛేజ్ చేసి.. చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఈ లీగ్ నుంచి ఔట్ అయిన అడిలైడ్ స్ట్రైకర్స్ పోతూపోతూ.. రికార్డు బ్రేకింగ్ విజయం నమోదు చేసింది. గురువారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 230 పరుగుల టార్గెట్‌ను 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లో ఛేదించింది. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక రన్ ఛేజ్. అడిలైడ్ ఓవెల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. బెన్ మెక్‌డెర్మోట్(57), కాలేబ్ జ్యువెల్(54), జాక్ క్రాలే(54) హాఫ్ సెంచరీలతో రాణించడంతో.. హరికేన్స్ భారీ స్కోర్ సాధించింది.
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. అడిలైడ్ బౌలర్లలో ఒక్క రషీద్ ఖాన్ తప్ప మిగతా బౌలర్లందరినీ హరికేన్ బ్యాటర్లు పిచ్చికొట్టుడు కొట్టారు. ప్రత్యర్థి జట్టు ఇంత భయంకరమైన బ్యాటింగ్ చేసినా.. రషీద్ ఖాన్ తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసి.. కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కెప్టెన్ షార్ట్ కూడా 4 ఓవర్లలో 34 ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఇక మిగిలిన బౌలర్ల ఎకానమీ 11పై మాటే. ఇక 230 పరుగుల రికార్డు బ్రేకింగ్ టార్గెట్‌ను ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ఆడిలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ర్యాన్ గిబ్‌సన్‌ను ప్యాట్రిక్ డోలీ అవుట్ చేశాడు. దీంతో అడిలైడ్ 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కానీ.. కెప్టెన్ మ్యాథ్యూ షార్ట్ మాత్రం సంచలన ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అతనికి క్రిస్ లిన్ సైతం తోడవడంతో.. అడిలైడ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 126 పరుగులు ఓడించారు. 64 పరుగులు చేసి క్రిస్ లిన్ ప్యాట్రిక్‌కే చిక్కాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఆడమ్ హోస్ సైతం 22 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సులతో 38 పరుగులు చేసి దడదడలాడించి అవుట్ అయ్యాడు. ఇక క్రీజ్‌లో పాతుకుపోయిన కెప్టెన్ షార్ట్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరికి విజయానికి 4 బంతుల్లో 4 పరుగుల అవసరమైన దశలో విన్నింగ్స్ షాట్‌గా బౌండరీ బాది గెలుపుతో పాటు తన సెంచరీని సైతం పూర్తి చేసుకున్నాడు. 19.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి.. బిగ్ బాష్ చరిత్రలో అత్యధిక టార్గెట్ ఛేదించిన జట్టుగా అడిలైడ్ స్ట్రైకర్స్ నిలిచింది. గతంలో 2017 బిగ్‌బాష్ సీజన్‌లో రెనెగేట్స్‌పై హరికేన్స్ జట్టు 223 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి గెలిచింది. ఇప్పుడు హరికేన్స్ రికార్డును వారిపైనే ఆడి అడిలైడ్ టీమ్ బ్రేక్ చేసింది. మరి రికార్డ్ బ్రేకింగ్ ఛేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pandemonium at the Adelaide Oval!
Unforgettable knock from Matt Short #BBL12 pic.twitter.com/s6Lcgc7qt9
— KFC Big Bash League (@BBL) January 5, 2023